MLA Marry AAP worker : పార్టీ కార్యకర్తను పెళ్లి చేసుకున్న ఆప్ మహిళా ఎమ్మెల్యే .. ఆశీర్వదించిన సీఎం

Sangrur AAp MLA Narinder Kaur Bharaj marry AAP worker
Sangrur MLA marry AAP worker : పంజాబ్‌కు చెందిన ఆప్ మహిళా ఎమ్మెల్యే నరిందర్ కౌర్ భరాజ్ తన పార్టీకే చెందిన కార్యకర్తను వివాహం చేసుకున్నారు. 28 ఏళ్ల నరిందర్ కౌర్ ఆప్ పార్టీ కార్యకర్త మణ్‌దీప్ సింగ్‌ను శుక్రవారం (సెప్టెంబర్ 7,2022) వివాహం చేసుకున్నారు. పటియాలాలో రోరేవాల్ గ్రామంలోని ఓ గురుద్వారాలో జరిగిన వీరి వివాహానికి పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సతీసమేతంగా హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు. సంగ్రూర్‌లోని భరాజ్ గ్రామంలో సాధారణ రైతు కుటుంబానికి చెందిన నరిందర్ కౌర్ పటియాలాలోని పంజాబ్ యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ చదివారు.
2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో తన గ్రామంలో ఒంటరిగా ఆమ్ ఆద్మీ పార్టీ బూత్ ఏర్పాటు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ ఏడాది జరిగిన పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో సంగ్రూర్ ఎమ్మెల్యేగా గెలిచారామె. నరిందర్ కౌర్.. పంజాబ్‌లో అతి చిన్న వయస్కురాలైన ఎమ్మెల్యేగా నరిందర్ కౌర్ గుర్తింపు పొందారు. మణ్‌దీప్ సింగ్ సంగ్రూర్ లోని భవానీ నగర్ బ్లాక్ లోని లఖేవాల్ గ్రామానికి చెందినవాడు. మణ్ దీప్ గతంలో సంగ్రూర్ జిల్లా ఆప్ మీడియా ఇంఛార్జ్‌గా పనిచేశారు.