ఒక్కటి కాబోతున్నారు : అజహర్ కొడుకుతో సానియా చెల్లి పెళ్లి

  • Publish Date - October 7, 2019 / 02:31 AM IST

ప్రముఖ క్రికెటర్ అజహరుద్దీన్ తనయుడు అసద్ వివాహం త్వరలో కాబోతోంది. ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా సోదరి ఆనమ్ మీర్జా..అసద్‌లు ఒక్కటి కాబోతున్నారు. వీళ్ల బంధంపై అనేక రోజులుగా ఊహాగానాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. వీటన్నింటికీ తెరదించుతూ..పెళ్లి విషయాన్ని సానియా కన్ఫామ్ చేసింది. పెళ్లి డిసెంబర్‌లో ఉంటుందని వెల్లడించింది. ఢిల్లీలో టెన్నిస్ టోర్నీకి ముఖ్య అతిథిగా హాజరైన సానియా..ఈ వ్యాఖ్యలు చేసింది. 

కొన్ని రోజులుగా ఆనమ్ – అసద్ మధ్య స్నేహం ఉంది. అసద్ కంటే ఆనమ్ మూడేళ్లు పెద్దదని తెలుస్తోంది. వారిద్దరూ తమ రిలేషన్‌ను తర్వాతి దశకు తీసుకెళ్లాలని నిర్ణయానికి వచ్చారు. అసద్, ఆనంల ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్లలో కనిపిస్తున్న కొన్ని పిక్‌లను చూస్తే..వీరి నిఖా పక్కా అయినట్లే ప్రచారం జరిగింది. వీరి కుటుంబాలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

అయితే..ఆనమ్‌కు గతంలోనే వివాహం అయినట్లు టాక్. భర్త నుంచి విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. టీమిండియా కెప్టెన్‌గా మహ్మద్ అజారుద్దీన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తరచూ వార్తల్లో కనిపిస్తూనే ఉంటారు. తాజాగా హెచ్‌సీఏ ఎన్నికల్లో అధ్యక్షుడిగా గెలుపొందారు. 
Read More : జడేజా సూపర్ మ్యాన్ క్యాచ్.. మార్కరమ్ అవుట్ ఇలా