Karnataka school Book: ‘జైలులో సావర్కర్ వద్దకు పక్షులు వచ్చేవి.. వాటి రెక్కలపై ఆయన ఎగిరి వెళ్ళేవారు’ అంటూ బడిలో పాఠాలు

కర్ణాటక ప్రభుత్వం మరో వివాదంలో ఇరుక్కుంది. చరిత్రను మార్చి రాయడానికి బీజేపీ సర్కారు ప్రయత్నాలు జరుపుతోందంటూ ఆరోపణలు వస్తోన్న వేళ కర్ణాటకలో 8వ తరగతి కన్నడ పాఠ్య పుస్తకంలో ఉన్న ఓ పాఠం అందుకు బలాన్ని చేకూర్చేలా ఉంది. ‘కాలాన్ని గెలిచిన వీరులు’ పాఠంలో వీడీ సావర్కర్‌పై వివరించారు. అయితే, ఆయన గురించి చెప్పే క్రమంలో అతిశయోక్తితో కూడిన వాక్యాలను రాసుకు వచ్చారని విమర్శలు వస్తున్నాయి. 

Karnataka school Book

Karnataka school Book: కర్ణాటక ప్రభుత్వం మరో వివాదంలో ఇరుక్కుంది. చరిత్రను మార్చి రాయడానికి బీజేపీ సర్కారు ప్రయత్నాలు జరుపుతోందంటూ ఆరోపణలు వస్తోన్న వేళ కర్ణాటకలో 8వ తరగతి కన్నడ పాఠ్య పుస్తకంలో ఉన్న ఓ పాఠం అందుకు బలాన్ని చేకూర్చేలా ఉంది. ‘కాలాన్ని గెలిచిన వీరులు’ పాఠంలో వీడీ సావర్కర్‌పై వివరించారు. అయితే, ఆయన గురించి చెప్పే క్రమంలో అతిశయోక్తితో కూడిన వాక్యాలను రాసుకు వచ్చారని విమర్శలు వస్తున్నాయి.

ఒక పేరాలో సావర్కర్ గురించి వివరిస్తూ… సావర్కర్ ను ఉంచిన అండమాన్‌ జైలులో కనీసం చిన్న రంధ్రం కూడా లేదని, అయినప్పటికీ ఆయన వద్దకు బుల్‌బుల్‌ పక్షులు వచ్చేవని పేర్కొన్నారు. అవి వచ్చాక వాటి రెక్కలపై సావర్కర్‌ కూర్చొని ప్రతిరోజు భారత భూమిని సందర్శించి వచ్చేవారని చెప్పారు. పక్షులు రావడం ఏంటీ, వాటిపై కూర్చొని వెళ్ళడం ఏంటీ? అంటూ విమర్శలు వస్తున్నాయి.

చరిత్ర గురించి చెప్పే పాఠంలో ఇటువంటి అభూత కల్పనలు పెట్టడం ఏంటని పలువురు నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే, కర్ణాటక సర్కారు మాత్రం ఆ పేరాను సమర్థించుకుంటోంది. దీనిపై కర్ణాటక మంత్రి బీసీ నాగేశ్‌ స్పందించారు. వీడీ సావర్కర్‌ వంటి యోధుడి చరిత్ర గొప్పదనం వర్ణనాతీతం అని చెప్పుకొచ్చారు. వీడీ సావర్కర్‌ ను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యోధుడిగా పేర్కొంటుందన్న విషయం తెలిసిందే. ఆయనపై కాంగ్రెస్ పార్టీ మాత్రం విమర్శలు గుప్పిస్తుంటుంది.

Chinese construction work: మరోసారి దుందుడుకు చర్యలకు పాల్పడుతోన్న చైనా.. అరుణాచల్‌ ప్రదేశ్‌లో నిర్మాణాలు?