Supreme Court: ఎట్టకేలకు సుప్రీంకోర్టులో పూర్తిస్థాయిలో న్యాయమూర్తుల నియామకం

తాజాగా నియామకైన న్యాయమూర్తుల్లో జస్టిస్ రాజేష్ బిందాల్, ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. గతంలో జమ్మూకశ్మీర్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. కలకత్తా హైకోర్టు మాజీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి కూడా పని చేశారు. అతను సెప్టెంబర్ 1985లో పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించారు

SC gets two new judges as Centre clears their appointment, apex court now has full strength

Supreme Court: దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో చాలా కాలం అనంతరం న్యాయమూర్తుల సంఖ్య పూర్తిస్థాయికి (34) చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇద్దరు కొత్త న్యాయమూర్తులను నియమించడంతో ఈ మార్కును అందుకుంది. ఈ విషయాన్ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా వెల్లడించారు. ఇద్దరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు శుక్రవారం సుప్రీంకోర్టుకు నియమించబడ్డారని, దీంతో సుప్రీంకోర్టు మొత్తం సభ్యుల సంఖ్య గరిష్టానికి చేరుకుందని ఆయన అన్నారు.

Rajasthan Budget 2023: పలుమార్లు చూసుకునేదాన్ని.. సీఎం గెహ్లాట్ బడ్జెట్ ప్రసంగం మీద మాజీ సీఎం రాజే

“భారత రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం, గౌరవనీయులైన రాష్ట్రపతి కింది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించారు. వారికి నా శుభాకాంక్షలు. వారు రాజేష్ బిందాల్, అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. అరవింద్ కుమార్, ప్రధాన న్యాయమూర్తి, గుజరాత్ హైకోర్టు’ అని న్యాయ మంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు.


ఈ ఇద్దరు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సహా 34 మంది న్యాయమూర్తులతో సుప్రీంకోర్టు పూర్తి స్థాయి సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఇంతకు ముందు పూర్తి స్థాయి న్యాయమూర్తులు ఉండేవారు కాదు. అయితే సెప్టెంబరు 2019లో ఈ ఫీట్ దక్కింది. అనంతరం మళ్లీ ఆ సంఖ్య పడిపోయింది. ఇక కేంద్రం, సుప్రీం మధ్య కొలీజియం జగడం వల్ల ఇది ఆలస్యమవుతూ వచ్చింది. అయితే కొలీజియం చేసిన సిఫార్సులను కేంద్రం ఎట్టకేలకు ఆమోదించి, సుప్రీంకు పూర్తి స్థాయి బలాన్ని చేకూర్చింది. వీరి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం గత నెలలో సిఫారసు చేసింది. గత వారం సుప్రీంకోర్టులో ఐదుగురు న్యాయమూర్తులు నియమితులయ్యారు.

Hardik Patel: ఐదేళ్ల నాటి కేసులో బీజేపీ నేత హార్దిక్ పటేల్‭ను నిర్దోషిగా తేల్చిన కోర్టు

ఇప్పటికే ఉన్న ఖాళీలు సహా ఈ ఏడాది మొత్తం తొమ్మిది మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పదవీ విరమణ చేశఆరు. జనవరి 2023లో జస్టిస్ అబ్దుల్ నజీర్ పదవీ విరమణ చేశారు. ఇక మేలో జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కేఎం జోసెఫ్, అజయ్ రస్తోగి, వి రామసుబ్రమణ్యం జూన్‌లో పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్ క్రిషన్ మురారి జూలైలో పదవీ విరమణ చేయనున్నారు, ఆ తర్వాత జస్టిస్ రవీంద్ర భట్ అక్టోబర్‌లో పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ డిసెంబర్‭లో పదవీ విరమణ చేయనున్నారు. ఈ ఖాళీలను కూడా గుర్తించి భర్తీ చేయాల్సి ఉంటుంది.

Mallikarjun Kharge: విపక్షాలు అడిగిన ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పని ప్రధాని మోదీ

ఇక తాజాగా నియామకైన న్యాయమూర్తుల్లో జస్టిస్ రాజేష్ బిందాల్, ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. గతంలో జమ్మూకశ్మీర్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. కలకత్తా హైకోర్టు మాజీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి కూడా పని చేశారు. అతను సెప్టెంబర్ 1985లో పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఇక జస్టిస్ అరవింద్ కుమార్, 2021 నుండి గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. 2009లో కర్ణాటక హైకోర్టుకు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 1987లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు.