Rajasthan Budget 2023: పలుమార్లు చూసుకునేదాన్ని.. సీఎం గెహ్లాట్ బడ్జెట్ ప్రసంగం మీద మాజీ సీఎం రాజే

ముఖ్యమంత్రి బడ్జెట్ ప్రతులు చుదువుతూ 2022-23 బడ్జెట్‭లోని రెండు ప్రకటనలు చేయగానే ప్రతిపక్షాలు రచ్చ చేయడం ప్రారంభించాయి. సభ వెల్‌లోకి దూసుకుపోయి హంగామా చేశారు విపక్ష నేతలు. స్పీకర్ సి.పి. జోషి జోక్యం చేసుకుని ఆర్డర్‌ను కొనసాగించాలని కోరినప్పటికీ విపక్షాలు వినిపించుకోలేదు. దీంతో సభ అరగంట పాటు వాయిదా పడింది

Rajasthan Budget 2023: పలుమార్లు చూసుకునేదాన్ని.. సీఎం గెహ్లాట్ బడ్జెట్ ప్రసంగం మీద మాజీ సీఎం రాజే

I used to repeatedly check: ex cm Raje on Gehlot reading old budget

Rajasthan Budget 2023: పోయిన ఏడాది బడ్జెట్ చదివి అసెంబ్లీ వేదికగా నవ్వులపాలయ్యారు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. ఒకటి కాదు, రెండూ కాదు, ఏకంగా ఏడు నిమిషాల పాటు 2022-23 నాటి బడ్జెట్ ప్రతులను చదివారు. కాగా, ఈ ఘటనపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే సింధియా స్పందిస్తూ.. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకటికి రెండు సార్లు బడ్జెట్ ప్రతులను చూసుకునేదాన్ని అని అన్నారు. బడ్జెట్ పేపర్ల మీద పట్టింపు లేని ఇలాంటి వ్యక్తి చేతిలో రాష్ట్రం ఎలా ఉందో ఆలోచించాలంటూ ఆమె విమర్శలు గుప్పించారు.

Adani Group: హిండెన్‌బర్గ్‭తో పోరాటానికి అమెరికాలోని టాప్ న్యాయ కంపెనీలను నియమించుకున్న అదానీ

రాజస్థాన్ రాష్ట్రంలో ఈరోజు (10 ఫిబ్రవరి) రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆర్థికమంత్రి హోదాలో రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఈ ఏడాది బడ్జెట్ (2023-24) కాకుండా పోయిన సంవత్సరం బడ్జెట్ (2022-23) పేపర్లు చదివారు గెహ్లాట్. ఇలా 7 నిమిషాల పాటు పాత బడ్జెట్ పేపర్లు చదివారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక నేత, వెనకాల నుంచి గెహ్లాట్ భుజం తట్టి ‘పోయిన ఏడాది బడ్జెట్ అది’ అని చెప్పే వరకు గెహ్లాట్ పసిగట్టలేదు.

Ambedkar Nagar: క్రాప్ హెయిర్ స్టైల్‭తో వస్తున్నాడని విద్యార్థికి గుండు కొట్టించిన టీచర్

ముఖ్యమంత్రి బడ్జెట్ ప్రతులు చుదువుతూ 2022-23 బడ్జెట్‭లోని రెండు ప్రకటనలు చేయగానే ప్రతిపక్షాలు రచ్చ చేయడం ప్రారంభించాయి. సభ వెల్‌లోకి దూసుకుపోయి హంగామా చేశారు విపక్ష నేతలు. స్పీకర్ సి.పి. జోషి జోక్యం చేసుకుని ఆర్డర్‌ను కొనసాగించాలని కోరినప్పటికీ విపక్షాలు వినిపించుకోలేదు. దీంతో సభ అరగంట పాటు వాయిదా పడింది. వాయిదా అనంతరం సభ ప్రారంభమైనప్పటికీ బీజేపీ ఎమ్మెల్యేలు వెల్‌లో బైఠాయించి ప్రభుత్వంపై వ్యతిరేక నినాదాలు చేయడం ప్రారంభించారు. తప్పుగా చదివినందుకు గెహ్లాట్ క్షమాపణ చెప్పి ప్రసంగాన్ని కొనసాగించే ప్రయత్నం చేసినప్పటికీ విపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు వ్యతిరేక నినాదాలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు.