దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు మంగళవారం (ఏప్రిల్ 23,2019) సంచలన తీర్పు ఇచ్చింది. 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్లలో సామూహిక అత్యాచారానికి గురైన బిల్కిస్ బానోకు 2 వారాల్లోగా రూ.50 లక్షల నష్టపరిహారం, ఉద్యోగం, నివాసం కల్పించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలంది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్‌తో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. తప్పిదాలకు పాల్పడిన అధికారులకు పెన్షన్ ప్రయోజనాలను నిలిపివేయాలని, ముంబై హైకోర్టు దోషులుగా తేల్చిన ఐపీఎస్ అధికారికి రెండు ర్యాంకులు డిమోట్ (తగ్గించాలని) చేయాలని ఆదేశించింది.
Also Read : పిల్లలా ప్రొఫెషనల్ కిల్లర్సా : 9 మంది విద్యార్థుల హత్యకు బాలికల ప్లాన్
2002లో అహ్మదాబాద్ సమీపంలోని రంధిక్ పూర్ గ్రామంలో గోద్రా రైలు దహనకాండ తర్వాత అల్లర్లు జరిగాయి. ఈ సమయంలో 19 ఏళ్ల వయసున్న బిల్కిస్ బానో తన కుటుంబ సభ్యులతో కలిసి ట్రక్‌లో వెళ్తుండగా అల్లర్ల మూక అడ్డుకుని దాడికి దిగింది. 5 నెలల గర్భిణిగా ఉన్న బానోపై సామూహిక అత్యాచారం జరిపారు. బానో రెండేళ్ల కుమార్తెతో పాటు 14 మంది కుటుంబ సభ్యులను అత్యంత కిరాతకంగా చంపేశారు. గుజరాత్ ప్రభుత్వం బానోకు గతంలో రూ.5 లక్షలు పరిహారం ఇవ్వచూపింది.
అయితే ఆ పరిహారం తీసుకునేందుకు ఆమె నిరాకరించారు. తనకు జరిగిన అపార నష్టానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అసాధారణ పరిహారం కోరుతూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2002 మార్చి 3న బానో కుటుంబపై ఓ ముఠా దాడి చేసింది. సామూహిక అత్యాచారానికి గురైన బాబో ఓ సంచార జీవిగా తలదాచుకుని బతకాల్సి వచ్చిందని కుటుంబసభ్యులు వాపోయారు. దీంతో ఆమెకు అసాధారణ రీతిలో పరిహారాన్ని ఇవ్వాలని బానో తరఫు న్యాయవాది శోభా గుప్తా వాదనలు వినిపించారు.
Also Read : శ్రీలంక పేలుళ్లలో మహిళా సూసైడ్ బాంబర్