Modi Cabinet: ఎస్సీ, ఎస్టీ, ఎక్కువ మంది మహిళలతో కేంద్ర కొత్త క్యాబినెట్!

కేంద్ర మంత్రిమండలి విస్తరణ జరగనుంది. మంత్రివర్గ విస్తరణకు కసరత్తు దాదాపుగా పూర్తయింది. ఇప్పటికే కొందరు ఎంపీలకు అందుబాటులో ఉండాల్సిందిగా సంకేతాలందాయి. మరో 25 మందితో మంత్రివర్గం విస్తరించే అవకాశాలున్నాయి.

Modi Cabinet: కేంద్ర మంత్రిమండలి విస్తరణ జరగనుంది. మంత్రివర్గ విస్తరణకు కసరత్తు దాదాపుగా పూర్తయింది. ఇప్పటికే కొందరు ఎంపీలకు అందుబాటులో ఉండాల్సిందిగా సంకేతాలందాయి. మరో 25 మందితో మంత్రివర్గం విస్తరించే అవకాశాలున్నాయి. బుధవారం సాయంత్రం 6 గంటలకు క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లుగా తెలుస్తుంది. ప్రధాని మోడీ సహా ప్రస్తుతం ఉన్న 54 మందికి అదనంగా మరో 25 మందిని చేర్చుకోనున్నారు. ప్రస్తుతం స్వతంత్ర హోదా, సహయమంత్రి నిర్వహిస్తున్న మంత్రులకు క్యాబినెట్ ర్యాంకు దక్కవచ్చు.

దాదాపు ఏడుగురు మంత్రులపై వేటు పడే అవకాశాలున్నాయని తెలుస్తోండగా.. అదనపు శాఖల్ని కొందరు మంత్రుల్నించి తప్పించే అవకాశాలున్నాయి. కాగా, నేడు విస్తరణలో అట్టడుగు వర్గాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలుస్తుంది. షెడ్యూల్ కుల వర్గాల రికార్డు ప్రాతినిధ్యంతో ‘సోషిత్, పిడిట్, వంచిత్, ఆదివాసీ, నిరుపేద, గిరిజన సంఘాల ప్రాతినిధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని తెలుస్తుంది. ఇతర వెనుకబడిన తరగతులకు (OBC) చెందిన కొత్తవారికి కూడా అవకాశం దక్కనున్నట్లు తెలుస్తుంది. ఇక మహిళలతో పాటు అనుభవానికి కూడా ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

ప్రస్తుతం ఉన్న మంత్రివర్గం బుధవారం ఉదయం 11 గంటలకు సమావేశమవనుండగా.. సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోడీ నివాసంలో ఉన్నతాధికారులతో పాటు బీజేపీ చీఫ్‌తో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ తదితరులు పాల్గొంటారు. ఎన్డీఏ నుంచి అకాలీదళ్ ఉపసంహరించుకోవడంతో ప్రస్తుతం మోడీ క్యాబినెట్ లో బీజేపీ నుండి మాత్రమే మంత్రులుండగా నేడు విస్తరణలో మరిన్ని భాగస్వామ్య పక్షాలకు పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

ఇందులో భాగంగా బీహార్‌లోని బీజేపీకి కీలక మిత్రపక్షమైన జేడీయూ మంత్రిత్వ శాఖలో ప్రాతినిధ్యం వహించనుండగా
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, గోవా, మణిపూర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌లు వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటున్నందున ఆయా రాష్ట్రాలతో పాటు యూపీ, ఢిల్లీకి కూడా పదవులు దక్కే అవకాశం కనిపిస్తుంది.

ట్రెండింగ్ వార్తలు