యూరప్ పర్యాటకులకు గుడ్,బాడ్ న్యూస్…షెంగ్జన్ వీసా ఫీజు పెరిగింది

  • Published By: venkaiahnaidu ,Published On : February 2, 2020 / 12:55 PM IST
యూరప్ పర్యాటకులకు గుడ్,బాడ్ న్యూస్…షెంగ్జన్ వీసా ఫీజు పెరిగింది

Updated On : February 2, 2020 / 12:55 PM IST

యూరప్ దేశాల్లో పర్యటనకు వెళ్లేందుకు ఫ్లాన్ చేసుకుంటున్నారా? అయితే మీ బడ్జెట్ ను కొంచెం పెంచుకోవాల్సిందే. ఇకపై యూరప్ పర్యటన కొంచెం ఖరీదు కానుంది. అదే సమయంలో వీసా కోసం దరఖాస్తు చేసుకునే సమయ గడువు కూడా పెరిగింది. అసలు ఇంతకీ షెంగ్జన్ వీసాలో ఏం మార్పుల జరిగాయి అని అనుకుంటున్నారా?

ఆస్ట్రియా,డెన్మార్క్,గ్రీస్,స్పెయిన్,స్విట్జర్లాండ్,జర్మనీ,ఫ్రాన్స్ తో కలిపి యూరప్ లోని 26దేశాల్లో పర్యటించాలనుకున్నవాళ్లకు షెంగ్జన్ వీసా పొందాల్సి ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే ఆదివారం నుంచి షెంగ్జన్ వీసా ఫీజులు పెరిగాయి. ఫిబ్రవరి-2,2020నుంచి షెంగ్జన్ వీసా ఫీజు 80యూరోలకు పెరిగినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 60యూరోలు మాత్రమే ఫీజుగా వసూలు చేస్తున్న విషయం తెలిసిందే.

పెరిగిన వీసా రుసుము…వీసా దరఖాస్తులను త్వరగా మరియు మరింత సమర్థవంతంగా ప్రాసెస్ చేయడానికి సభ్య దేశాలకు అదనపు ఆర్థిక వనరులను అందిస్తుందని, అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం… వీసా రుసుము తక్కువగానే ఉంటుందని  అధికారులు తెలిపారు. రెగ్యులర్ యూరప్ ట్రావెలర్స్ కి…ల్యాంగ్ వ్యాలిడిటీ వీసాలపై కొత్త రూల్స్ ద్వారా ఫీజు పెరుగుదల భర్తీ చేయబడుతుంది. ఈ ప్రయాణికులు వాస్తవానికి కొత్త నిబంధనల ప్రకారం డబ్బును ఆదా చేయవచ్చు. వారు వీసాల కోసం తక్కువసార్లు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.

ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు వీసా రుసుము ఇప్పటికీ లేదు. 6ఏళ్ల నుంచి 12ఏళ్ల లోపు మధ్య మైనర్లకు వీసా రుసుము సాధారణ రుసుములో సగం వరకు ఉంటుంది. తద్వారా 5 యూరోలు (40 యూరోలకు) పెరుగుతుందని అధికారులు తెలిపారు. కొత్త వీసా విధానాల ప్రకారం..6నుంచి 18ఏళ్ల లోపు ఉండే మైనర్లకు వీసా ఫీజు రద్దు చేసే అవకాశం ఈయూ సభ్యదేశాలకు ఉంటుంది.

శుభవార్త

యూరప్ కు ట్రావెల్ చేయాలనుకున్నవారు తాము ప్రయాణించాలకున్న డేట్ కు ఆరు నెలల ముందే షెంగ్జన్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ప్రయాణించాలనుకున్న డేట్ కు మూడు నెలల ముందు మాత్రమే వీసా కోసం అప్లయ్ చేసుకోవాలన్న విషయం తెలిసిందే. ఓడల ద్వారా ప్రయాణం చేసేవాళ్లకు కనీస టైమ్ పీరియడ్ 9నెలలుగా ఉండబోతున్నట్లు అధికారులు తెలిపారు.

మరోవైపు తరుచుగా యూరప్ లో పర్యటించేవాళ్ల కోసం మరో బంపరాఫర్ ఇచ్చారు అధికారులు. పాజిటివ్ వీసా హిస్టరీతో తరుచుగా ప్రయాణించేవాళ్లకు…నెమ్మదిగా వీసా వ్యాలిడిటీ పీరియడ్ ఒక ఏడాది నుంచి గరిష్ఠంగా ఐదేళ్లకు పెంచుతూ మల్టిపుల్ ఎంట్రీ వీసా జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదాహరణకు…రెండు సంవత్సరాలలో  మూడు వీసాలు పొంది, సరిగ్గా ఉపయోగించిన ఒక దరఖాస్తుదారుడుకి ఈ కాలంలో ఒక సంవత్సరానికి చెల్లుబాటు అయ్యే మల్టిపుల్ ఎంట్రీ వీసా మంజూరు చేయబడుతుంది. ఒక సంవత్సరానికి మల్టిపుల్-ఎంట్రీ వీసా పొంది,సక్రమంగా ఉపయోగించిన ఒక దరఖాస్తుదారుడు (రెండు సంవత్సరాలలో దరఖాస్తు చేసుకుంటే) రెండు సంవత్సరాల వరకు చెల్లుబాటు అయ్యే బహుళ-ఎంట్రీ వీసా ఇవ్వబడుతుందని అధికారులు తెలిపారు.