Kumbh Mela: కొద్ది రోజుల క్రితం మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్‌లోని బాన్స్‌బేరియా నగరంలోని ట్రిబెని ప్రాంతంలో 700 సంవత్సరాల తర్వాత కుంభమేళా పునరుజ్జీవింపబడిందని అన్నారు. అయితే ఇది అవాస్తవమట. తన పరిశోధనా పత్రాన్ని హిందుత్వ సంస్థలు తప్పుడుగా ప్రచారం చేశాయని కెనడియన్ రిటైర్డ్ ఆంత్రోపాలజిస్ట్ అలాన్ మోరినిస్ గురువారం చెప్పారు. ఫిబ్రవరి 26న తన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ త్రిబేని కుంభమేళాపై చేసిన ఈ వ్యాఖ్యలకు మోరినిస్ తాజాగా వివరణ ఇవ్వడం గమనార్హం.
Prashant Kishore: ఆ పొరపాటు చేయొద్దు.. కర్ణాటకలో కాంగ్రెస్ విజయంపై ప్రశాంత్ కిశోర్
“చారిత్రక వాస్తవం ఏమిటంటే, త్రిబేనిలో కుంభమేళా ఎప్పుడూ జరగలేదు. ‘పునరుద్ధరణ’ అని చెబుతున్నది అవాస్తవం. నా పరిశోధనా పత్రాన్ని తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు” అని అలాన్ మోరినిస్ ఒక వ్యాసంలో రాశారు. “ఈ తప్పుడు సమాచారానికి మూలం ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో నా డాక్టరల్ డిసెర్టేషన్‌లోని ఒక వాక్యం. అందుకే నేను ఇంత నమ్మకంగా చెబుతున్నాను” అని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో జరిగిన “త్రిబేణి కుంభ మహోత్సవ్”లో ఎనిమిది లక్షల మందికి పైగా భక్తులు పాల్గొన్నారని ఆయన చెప్పారు. “దురదృష్టవశాత్తు బెంగాల్‌లోని త్రిబేనిలో జరిగే ఈ పండుగ 700 సంవత్సరాల క్రితం నిలిపివేయబడింది. ఇది స్వాతంత్ర్యం తరువాత ప్రారంభించబడాలి, కానీ అది కూడా జరగలేదు” అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
Cabinet reshuffle: కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెణ్ రిజిజు శాఖ మార్పు.. మోదీ కీలక నిర్ణయం