Scrub Typhus : బాబోయ్.. భయపెడుతున్న స్క్రబ్ టైఫస్, 180కి పెరిగిన కేసుల సంఖ్య, 5రోజుల పాటు జ్వరం ఉంటే డేంజరే

ఇప్పటివరకూ ఈ వ్యాధి బారిన పడి ఏడుగురు చనిపోయారు. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. Scrub Typhus - Odihsa

Scrub Typhus (Photo : Google)

Scrub Typhus – Odihsa : స్క్రబ్ టైఫస్.. ఒడిశాను వణికిస్తోంది. క్రమంగా ఈ వ్యాధి విస్తరిస్తూ ప్రజలకు, అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అసలే నిఫా వైరస్.. కేరళను బెంబెలెత్తిస్తోంది. ఒడిశాలో స్క్రబ్ టైఫస్ హడలెత్తిస్తోంది. తాజాగా సుందర్ గడ్ జిల్లాలో 11 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. 59శాంపిల్స్ ను టెస్ట్ చేయగా 11 మందికి స్క్రబ్ టైఫస్ వ్యాధి నిర్ధారణ అయ్యింది.

దీంతో ఒడిశా రాష్ట్రంలో మొత్తం స్క్రబ్ టైఫస్ కేసుల సంఖ్య 180కి చేరింది. ఇప్పటివరకూ ఈ వ్యాధి బారిన పడి ఏడుగురు చనిపోయారు. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. కాగా, ఎవరికైనా 4 లేదా 5 రోజులు పాటు జ్వరం ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని ఆరోగ్యశాఖ అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.

వైరస్ బారిన పడిన 180 మందిలో, 10 మంది రోగులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కాగా, తొమ్మిది మంది ఇతర జిల్లాలకు చెందిన వారున్నారు అని సుందర్‌గఢ్ చీఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ నాయక్ తెలిపారు. నాలుగు లేదా ఐదు రోజుల పాటు జ్వరం కొనసాగితే కచ్చితంగా డాక్టర్ ని సంప్రదించాలని.. ఉచితంగా పరీక్షలు చేస్తున్నామని, అక్కడ టెస్ట్ చేయించుకోవాలని సుందర్‌ఘర్‌ ముఖ్య జిల్లా వైద్యాధికారి ప్రజలకు సూచించారు. రూర్కెలా ప్రభుత్వ ఆసుపత్రి, సుందర్‌ఘర్ జిల్లా ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Also Read..Stress Problem : ఈ సంకేతాలు ఉంటే మీరు ఒత్తిడి సమస్యను కలిగి ఉన్నట్లే !

స్క్రబ్ టైఫస్ ఎలా సోకుతుంది? లక్షణాలేంటి?
స్క్రబ్ టైఫస్.. ఈ వ్యాధి ఇప్పుడు ఒడిశాను కలవరపెడుతోంది. దీని పేరు వినిపిస్తే చాలు ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఇంతకీ ఈ వ్యాధి ఎలా సోకుతుంది? లక్షణాలు ఏంటి?

* తరచూ పొలాుల, అటవీ ప్రాంతాల్లో పని చేసేవారికి స్క్రబ్ టైఫస్ సోకుతుంది.
* ఒక రకమైన లార్వా పురుగులు కుట్టడంతో శరీరంపై ఎస్చర్ అనే మచ్చ పుడుతుంది.
* ఈ కీటకాలు కుట్టిన చోట చర్మకణాలు చనిపోతాయి.
* వ్యాధి సోకిన వారికి శరీరంపై దద్దుర్లు, తీవ్ర జ్వరం, కొద్ది మందిలో శ్వాసలోపం లక్షణాలు ఉంటాయి.
* నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది.

Also Read..Hearing Loss : వినికిడి ప్రమాదం రాకుండా ఉండాలంటే ?

స్క్రబ్ టైఫస్: కారణాలు, సాధారణ లక్షణాలు
* స్క్రబ్ టైఫస్ ను బుష్ టైఫస్ అని కూడా పిలుస్తారు
* ఇది ఓరియంటియా సుట్సుగముషి(Orientia tsutsugamushi) అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి.
* లార్వా మైట్స్ కాటు ద్వారా ఈ వ్యాధి మానవులకు వ్యాపిస్తుంది.

వ్యాధి లక్షణాలు..
* అధిక జ్వరం
* పొడి దగ్గు
* తీవ్రమైన తలనొప్పి
* శరీర నొప్పులు
* ఎరుపు కళ్ళు
* ఎరుపు మచ్చలు లేదా శరీరంపై దద్దుర్లు
* కండరాల నొప్పి