Parliament Budget Session : రేపటి నుంచి పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు

పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 8 వరకు కొనసాగుతాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పూర్తి స్థాయిలో ఈ సమావేశాలు జరగనున్నాయి.

Parliament Budget Session : రేపటి నుంచి పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు

Parliament Budget Session

Updated On : March 13, 2022 / 9:22 PM IST

Parliament Budget Session :  పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 8 వరకు కొనసాగుతాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పూర్తి స్థాయిలో ఈ సమావేశాలు జరగనున్నాయి. రేపు ఉదయం 11 గంటల నుంచి పార్లమెంట్ ఉభయ సభలు వేరు వేరుగా సమావేశం అవుతాయి.

పెరుగుతున్న నిరుద్యోగం,రైతు సమస్యలు,పంటలకు మద్దతు ధర,ద్రవ్యోల్బణం, కార్మికుల సమస్యలు, ఉద్యోగుల భవిష్య నిధిపై వడ్డీ రేటు 8.5 నుంచి 8.1 కి తగ్గింపు  వంటి సమస్యలతో   సహా యుద్ద-ప్రభావిత ఉక్రెయిన్‌ నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థుల భవిష్యత్తు …అనేక ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు విపక్షాలు సన్నధ్ధమవుతున్నాయి.
Also Read : US Journalist: రష్యా బలగాల చేతిలో ప్రాణాలు కోల్పోయిన అమెరికన్ జర్నలిస్టు
లోక్‌సభలో కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్ రేపు  జమ్మూ కాశ్మీర్‌కు బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలు,జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంత బడ్జెట్‌కు ఆమోదం అంశాలపై కేంద్రం దృష్టి సారించనుంది.
Also Read : Transgenders Cafe : ఆ కేఫ్ లో అందరూ ట్రాన్స్ జెండర్సే
ఈ అంశాలు లంచ్ తర్వాత లోక్‌సభలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. విదేశాంగ మంత్రి జయశంకర్ ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు పై పార్లమెంట్ ఉభయసభల్లో ప్రకటన చేయనున్నారు. కాగా…. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 11 వరకు తొలి విడత బడ్జెట్ సమావేశాలు  జరిగాయి. రేపటి నుంచి రెండో విడత సమావేశాలు ప్రారంభంకానున్నాయి.