Doctors Die : డాక్టర్లపై కరోనా పంజా, దేశంలో 1300మంది వైద్యులు మృతి

కరోనా మహమ్మారి సాధారణ ప్రజల నుంచి ప్రముఖుల వరకూ అందరినీ పొట్టనబెట్టుకుంటోంది. వారికి వైద్యం అందించే డాక్టర్లను కూడా కరోనా బలి తీసుకుంటోంది. కష్టకాలంలో ప్రాణాలకు తెగించి కరోనా బాధితులకు డాక్టర్లు వైద్య సేవలు అందిస్తున్నారు. కరోనావైరస్

Second Wave Of Covid 19 Saw 594 Doctors Die Indian Medical Association

Doctors Die Of Covid : కరోనా మహమ్మారి సాధారణ ప్రజల నుంచి ప్రముఖుల వరకూ అందరినీ పొట్టనబెట్టుకుంటోంది. వారికి వైద్యం అందించే డాక్టర్లను కూడా కరోనా బలి తీసుకుంటోంది. కష్టకాలంలో ప్రాణాలకు తెగించి కరోనా బాధితులకు డాక్టర్లు వైద్య సేవలు అందిస్తున్నారు. కరోనావైరస్ ప్రాణాంతకం అని తెలిసినా, రిస్క్ అని తెలిసినా ధైర్యంగా విధులు నిర్వహిస్తున్నారు. కరోనా బాధితులకు చికిత్స అందించి వారి ప్రాణాలు కాపాడుతున్నారు. ఈ క్రమంలో డాక్టర్లు సైతం కరోనా బారిన పడి ప్రాణాలు వదులుతున్నారు.

మహమ్మారితో పోరాడుతూ మృత్యువాత పడుతున్న వైద్యుల సంఖ్య నానాటికి పెరుగుతుందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వెల్లడించింది. కరోనా సెకండ్ వేవ్ లో 594 మంది వైద్యులు కరోనాతో మరణించగా, వారిలో దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో ఎక్కువమంది ఉన్నారు. కరోనా సెకండ్ వేవ్ లో ఢిల్లీలో 107 మంది డాక్టర్లు మరణించారు. బీహార్ రాష్ట్రంలో 96 మంది, ఉత్తరప్రదేశ్ లో 67 మంది డాక్టర్లు కరోనాతో కన్నుమూశారు.

రాజస్థాన్ రాష్ట్రంలో 43 మంది డాక్టర్లు, తెలంగాణలో 32 మంది, ఆంధ్రప్రదేశ్ లో 32 మంది డాక్టర్లు కరోనాకు బలయ్యారు. వైద్యులే కాకుండా వారి కుటుంబసభ్యులు కూడా కరోనా బారిన పడ్డారని ఐఎంఏ తెలిపింది. రోగులకు చికిత్స చేస్తూ కరోనా సోకి కన్నుమూసిన అమరవీరుల త్యాగాన్ని మరువలేమంది.

ఇప్పటివరకు రెండు విడతల్లో 1,342 మంది వైద్యులు మృతి చెందారు. గతేడాది ఫస్ట్ వేవ్ లో కరోనాతో 748 మంది వైద్యులు చనిపోయారు. దేశంలో 12లక్షలకు పైగా డాక్టర్లు ఉన్నారు. వైద్యుల సంఘంలో రిజిస్టర్ అయిన వారు 3.5 లక్షల మంది మాత్రమే. రిజిస్టర్ కాని వారు ఎంతో మంది ఉన్నారు. దీంతో చనిపోయిన వారి సంఖ్య మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా హెల్త్ వర్కర్స్ లో సుమారు 70 శాతం మందికి మాత్రమే టీకాలు వేశారు. ఇప్పటికే 90శాతం మంది హెల్త్ వర్కర్స్ మొదటి డోసు టీకా తీసుకున్నారు.