Amravati : అమరావతిలో 144 సెక్షన్‌.. 3 రోజులు ఇంటర్నెట్‌ బంద్‌!

మహారాష్ట్రలోని అమరావతిలో హింసాత్మక నిరసనలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అమరావతిలో CRPC సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు విధించారు పోలీసులు.

Amravati Section 144 Imposed : మహారాష్ట్రలోని అమరావతిలో హింసాత్మక నిరసనలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అమరావతిలో CRPC సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు విధించారు పోలీసులు. ఇంటర్నెట్ సేవలను కూడా మూడు రోజుల పాటు నిలిపివేసినట్లు అమరావతి పోలీసులు వెల్లడించారు. త్రిపురలో ఇటీవలి హింసాకాండను ఖండిస్తూ ముందురోజు ముస్లిం సంస్థలు నిర్వహించిన ర్యాలీలకు నిరసనగా స్థానిక బీజేపీ కార్యకర్తలు బంద్ నిర్వహించారు. ఈ బంద్‌లో దుకాణాలపై రాళ్లు రువ్వడంతో హింస చెలరేగింది.

శనివారం (నవంబర్ 13) ఉదయం, ముంబైకి 670 కిలోమీటర్ల దూరంలో తూర్పు మహారాష్ట్ర నగరంలోని రాజ్‌కమల్ చౌక్ ప్రాంతంలోని వందలాది మంది ప్రజలు కాషాయ జెండాలు పట్టుకుని, నినాదాలు చేస్తూ వీధుల్లో ఆందోళనకు దిగారు. కొంతమంది సభ్యులు రాజ్‌కమల్ చౌక్, ఇతర ప్రదేశాలలో దుకాణాలపై రాళ్లు రువ్వారు. రంగంలోకి దిగిన అమరావతి పోలీసులు శాంతిభద్రతల పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆందోళనకారులపై లాఠీఛార్జ్ చేశారు. శుక్ర, శనివారాల్లో రాళ్లదాడి ఘటనలు కొనసాగుతుండడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు CRPC సెక్షన్‌ 144(1), (2), (3) కింద అమరావతి నగర పరిధిలో కర్ఫ్యూ విధించినట్టు పోలీసు అధికారి తెలిపారు.

అదనపు పోలీసు కమిషనర్ సందీప్ పాటిల్ ఉత్తర్వులు జారీ చేశారు. మెడికల్ ఎమర్జెన్సీకి మినహా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని పోలీసులు తెలిపారు. ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడడం అనుమతిలేదు. ఈ ఘటనలో అల్లర్లు సహా పలు ఆరోపణల కింద 20 FRIలు నమోదు చేసిన పోలీసులు తెలిపారు.

ఇప్పటివరకు 20 మందిని అరెస్టు చేయగా.. మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. త్రిపురలో మైనారిటీ వర్గాలపై జరుగుతున్న దౌర్జన్యాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ అమరావతిలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వెలుపల 8 వేల మందికి పైగా ప్రజలు మెమోరాండం సమర్పించారు. హింస, విధ్వంసానికి పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు.
Read Also : Maoists Kidnap Engineer : నా భర్తను క్షేమంగా విడిచిపెట్టండి..మావోలకు ఇంజనీర్ భార్య వేడుకోలు

ట్రెండింగ్ వార్తలు