Maoists Kidnap Engineer : నా భర్తను క్షేమంగా విడిచిపెట్టండి..మావోలకు ఇంజనీర్ భార్య వేడుకోలు

చత్తీస్ గఢ్ లోని   బీజాపూర్ జిల్లాలో మూడు రోజుల క్రితం కిడ్నాప్‌కు గురైన ఇంజనీర్ అజయ్‌ను క్షేమంగా విడిచి పెట్టాలని అతని భార్య మావోలకు విజ్ఞప్తి చేసింది. 

Maoists Kidnap Engineer : నా భర్తను క్షేమంగా విడిచిపెట్టండి..మావోలకు ఇంజనీర్ భార్య వేడుకోలు

Engineer Wife

Maoists Kidnap Engineer :  చత్తీస్ గఢ్ లోని   బీజాపూర్ జిల్లాలో మూడు రోజుల క్రితం కిడ్నాప్‌కు గురైన ఇంజనీర్ అజయ్‌ను క్షేమంగా విడిచి పెట్టాలని అతని భార్య మావోలకు విజ్ఞప్తి చేసింది.  ప్రధానమంత్రి గ్రామీణ్ సడక్ యోజన ప్లానింగ్ ఆఫీస్‌లో ఉన్న ఇంజనీర్‌ అజయ్‌ను మరో వ్యక్తి   లక్ష్మణ్ పర్తగిరి ని మావోయిస్టులు మూడు రోజు క్రితం కిడ్నాప్ చేసారు. వారిలో లక్ష్మణ్ ను మావోలు విడిచి పెట్టారు.  ఇంజనీర్ అజయ్ ను మాత్రం ఇంత వరకు విడిచి పెట్టలేదు. దీంతో ఇంజనీర్ అజయ్ భార్య అర్పిత బుర్జి గ్రామానికి వెళ్లి తన భర్తను విడిచిపెట్టాలని వేడుకుంది.

బుర్జిలో గత 47 రోజులుగా   అడెస్‌మెట్ట మారణకాండలో మృతి చెందిన    గ్రామస్థులకు పరిహారం కోసం, రోడ్డు నిర్మాణం,  శిబిరాల ఏర్పాటు కోసం ఉద్యమం జరుగుతోంది. ఆందోళనకు  దిగిన స్థానికుల ఫోరం ద్వారా, మీడియా ద్వారా  ఆమె మావోయిస్టులకు విజ్ఞప్తి చేసింది. నా భర్త మంచి వాడని కిడ్నాప్ అయన నాటి నుండి నేటి వరకు మా కుటుంబం ఏమీ తినలేదని,  3 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడని…. తండ్రి కోసం తన బిడ్డ ఎదురు చూస్తున్నాడని ఆమె తెలిపింది.

Also Read : Actor Puneeth Rajkumar : ఏనుగు పిల్లకు పునీత్ రాజ్‌కుమార్ పేరు

బీజాపూర్ జిల్లా కేంద్రం నుంచి గోర్నా-మంకేలి గ్రామం వరకు 15 కిలోమీటర్ల మేర ఒక రహదారిని నిర్మిస్తున్నారు. ఇంజనీర్ అజయ్ రోషన్ లఫ్డా, లక్ష్మణ్ పర్తగిరి గోవా మంకెలి ప్రాంతంలో కొనసాగుతున్న రహదారి నిర్మాణ పనులను పరిశీలించడానికి వెళ్లారు.  అయితే ఇద్దరూ తిరిగి  సాయంత్రానికి   ప్రధాన కార్యాలయానికి రాలేదు.  వారిద్దరూ ఎంతకూ తిరిగి రాకపోయేసరికి అధికారులు మరియు డిపార్ట్‌మెంట్‌లోని ఉద్యోగులు ఇద్దరి కోసం వెతికారు.

ఆ తర్వాత ఎలాంటి క్లూ లభించకపోవడంతో గ్రామాలలలో విచారించారు. పెళ్లి దుస్తుల్లో ఉన్న కొందరు వారిద్దరినీ అడవిలోకి తీసుకెళ్లినట్లు గ్రామస్థులు డిపార్ట్‌మెంట్ అధికారులకు తెలిపారు.  దీంతో వారిద్దరినీ మావోయిస్టులు కిడ్నాప్ చేసినట్లు నిర్ధారించుకున్నారు. చత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లా గోర్నా గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని కన్హాయి గూడ గ్రామం నుంచి మావోయిస్టులు ఇద్దరినీ కిడ్నాప్ చేశారు. శుక్రవారం సాయంత్రం పార్ధగిరిని మావోలు విడిచి పెట్టారు.  అర్పిత బుర్జి గ్రామానికి వెళ్లి తన భర్తను సురక్షితంగా విడుదల చేయాలని వేడుకుంది.