Ridge Gourd
Ridge Gourd : తీగ జాతి కూరగాయ వంటలలో బీర ఒక ముఖ్యమైన పంట. మనదేశంలో బీరను 10,040 హెళ్చార్ల విస్తీర్ణంలో సాగుచేస్తూ మొత్తం 1,28,310 టన్నుల దిగుబడి సాధిస్తున్నారు. బీర తక్కువ సమయంలోనే పంట చేతికందుతుంది. పందిరి విధానంలో యాజమన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు వస్తాయి. విత్తన ప్రక్రియ ఆరంభమైన మూడు వారాలకే కాతకు రావడం బీర పంట ప్రత్యేకత. సులభంగా తెంపి మార్కెట్‌కు తరలించవచ్చు. ఎక్కువ మంది కూలీలు అవసరం లేదు. సరాసరి దిగుబడి 6 టన్నులకు పైగా ఉంటుంది.
తేమతో కూడిన వేడి వాతావరణం వీటి సాగుకు అనుకూలము. ఉష్ణోగ్రత 25-30 సెం.ఉంటే తీగ పెరుగుదల బాగా ఉండి పూత, పిందె బాగా పడుతుంది. తీగ మొదటి పెరుగుదల దశలో వేడి ఎక్కువగా ఉంటే మగపూలు ఎక్కువగా వస్తాయి. నీటిని నిలువుకునే తేలికపాటి ఎర్ర గరప మరియు బంకమట్టి నేలలు, ఉదజని సూచిక 60-70 మధ్య ఉన్న నేలలు, మురుగునీరు పోయే సౌకర్యం గల ఒండ్రు నేలలు అనుకూలంగా ఉంటాయి.
సాగుకు అనువైన బీర రకాలు:
జగిత్యాల లాంగ్: ఇది తెలంగాణాలోని కరీంనగర్ జిల్లాకు చెందిన దేశవాళీ రకం. కాయలు 50-60 సెంమీ. పొడపుతో సన్నగా, లోతైన కణుపులు కలిగి ఉంటాయి. ఖరీఫ్‌లో అధిక దిగుబడినిస్తుంది. వేనవిలోని అధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేదు.
కో-1 ; ఇది తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం, కోయందితూరు నుండి విడుదలయిన రకం. తీగ పెరుగుదల. మధ్యస్థంగా ఉంటుంది. కాయలు 40-50 సెం.మీ. పొడవుండి, కాయమీద కణుపులు ఎత్తుగా ఉంటాయి. కాయ పూత చివర భాగం వెడల్పుగాను, కాయ తొడిమ భాగం సన్నగా ఉంటుంది. ఒక్కో కాయ 800 గ్రా. తూగుతుంది. పంటకాలం : 125 రోజులు, దిగుబడి 6 టన్నులు.
కో-2 ; ఇది కూడా తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం, కోయంబత్తూరు నుండి విడుదలయిన రకం. ఈరకం కాయలు చాలా పొడవుగా ఉంటాయి. 90-160 సెం.మీ. వరకు ఉంటాయి. గింజలు కో-1లో కంటే తక్కువగా ఉంటాయి. ఒక్కో కాయ 700-800 గ్రా. బరువుంటుంది. పంటకాలం : 120 రోజులు, దిగుబడి 10 టన్నులు.
పి.కె.యం-1 : తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం, పెరియాకుళం నుండి విడుదలయిన రకం, కాయలు,60-70 సెం.మీ. పొడవుతో, కాయ చివర వెడల్పుగాను, తొడిమ భాగం సన్నగాను ఉంటుంది. పంటకాలం: 130 రోజులు, దిగుబడి :6నుండి 7టన్నల మధ్య ఉంటుంది.
పూసానన్‌దర్: ఇది మధ్యప్రదేశ్ నుండి ఎన్నిక చేసిన రకం, భారతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం, న్యూఢిల్లీ, నుండి రూపొందించబడింది. త్వరగా కాపుకు వస్తుంది. (60-65 రోజులలో). ఒక్కో తీగకు 15-20 కాయలు కాస్తాయి. కాయలు లేత అకువచ్చ రంగులోను, లోవలి గుజ్జు లేత వనువు రంగులోను ఉంటుంది. ఈ రకం ఖరీఫ్‌కు, వేసవికి అనుకూలం. దిగుబడి : 6-7 టన్నులు
పత్‌పుతియ : ఇది బీహారు రకం. ఈ రకంలో ద్విలింగ వుష్పాలుంటాయి. కాయలు గుత్తులుగా, చిన్నవిగా కాస్తాయి.ఖరీఫ్, వేసవి కాలానికి అనువైనది.
అర్భ నుమీత్: ఇది భారతీయ ఉద్యాన పరిశోధన సంస్థ, బెంగుళూరు నుండి విడుదలయిన రకం. తీగ పెరుగుదలమధ్యస్థంగా ఉంటుంది. 15వ కణుపుకు కాయ కాస్తుంది. కాయలు 25 సెం.మీ. మందం, 55 సెం.మీ. పొడవుతో ఉంటాయి. 52 రోజులలో మొదటి కోతకు వస్తుంది. ఒక్కో తీగకు 13-15 కాయలు వస్తాయి. ఒక్కో కాయ 380గ్రా. బరువుంటుంది. పంటకాలం : 120 రోజులు, దిగుబడి : 21 టన్నులు
అర్భ సుజాత: ఇది త్వరగా కాపుకు వచ్చే ఐ.ఐ. హెచ్‌ఆర్. – వశ, పొడవు రకం, ఐ.ఐ. హెద్‌ఆర్.-18 లను సంకర పరచి రూపొందించబడింది. మొదటి కాయ 13-15 కణుపుకు వస్తుంది. కాయ 50-55 సెం.మీ. పొడవుంటుంది. పంటకాలం : 100 రోజులు. దిగుబడి: 21టన్నులు. ఈ రకం కొంత వరకు బూజు తెగులను తట్టుకుంటుంది.
ఇవికాక వివిధ ప్రైవేట్ హైట్ రకాలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. సురేఖా, సంజీవని, ఎన్.ఎస్.3, ఎన్.ఎస్.401, ఎన్.ఎన్.403, మహిమ రకాలు వేసవికి కూడ అనువైన హైబ్రిడ్ రకాలు.