Mumbai: గణేష్ నిమజ్జనంలో శివసేన vs శివసేన.. ముంబైలో ఇరు కార్యకర్తల ఫైట్

వచ్చే నెలలో జరగబోయే దసరా కోసం శివాజీ పార్క్‭ను బుక్ చేసుకునేందుకు సైతం ఇరు వర్గాల మధ్య తీవ్ర పోటీ కొనసాగుతోంది. అటు ఉద్ధవ్ వర్గం, ఇటు షిండే వర్గం బీఎంసీలో పోటాపోటీగా దరఖాస్తులు ఇస్తున్నారట. ఇక ఇప్పటికే వీరి మధ్య అసలైన శివసేన తమదే అనే యుద్ధం కొనసాగుతోన్న విషయం తెలిసిందే.

Mumbai: ఇరు శివసేనల వైరం మాటిమాటికీ ముదురుతోంది. తాజాగా గణేష్ నిమజ్జనోత్సవంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ముంబైలోని ప్రభాదేవి ప్రాంతంలో శనివారం రాత్రి ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. అసలైన శివసేన తమదే అంటూ ఒకవైపు ఉద్ధవ్ థాకరే వర్గం, మరొకవైపు ఏక్‭నాథ్ షిండే వర్గం క్లెయిమ్ చెప్పుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా.. మరొకవైపు ఇరు వర్గాల కార్యకర్తల మధ్య ఈ గొడవలు సాధారణమయ్యాయి.

గణేష్ నిమజ్జనం జరుగుతుండగా ఉద్ధవ్ థాకరే వర్గంలోని కార్యకర్తలను తమపై దాడికి దిగడమే కాకుండా బెదిరింపులు చేశారని షిండే వర్గానికి చెందిన సంతోష్ తెలవనె పేర్కొన్నారు. అయితే షిండే వర్గంలోని కార్యకర్తలు తమ నేత గురించి అభ్యంతరకరంగా మాట్లాడారని ఉద్ధవ్ వర్గం కార్యకర్తలు తిప్పికొట్టారు. ఇరు వర్గాల కార్యకర్తలు ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేయడంతో.. ఈ ఘటనపై విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Pakistan: పాకిస్థాన్‌కు అమెరికా సైనిక సాయంపై భారత్ ఆగ్రహం.. తమ అభ్యంతరాలు తెలిపిన భారత్

ఇక ఇదిలా ఉంటే.. వచ్చే నెలలో జరగబోయే దసరా కోసం శివాజీ పార్క్‭ను బుక్ చేసుకునేందుకు సైతం ఇరు వర్గాల మధ్య తీవ్ర పోటీ కొనసాగుతోంది. అటు ఉద్ధవ్ వర్గం, ఇటు షిండే వర్గం బీఎంసీలో పోటాపోటీగా దరఖాస్తులు ఇస్తున్నారట. ఇక ఇప్పటికే వీరి మధ్య అసలైన శివసేన తమదే అనే యుద్ధం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఉద్ధవ్ నేతృత్వంలోనిదే అసలైన శివసేనని, దొంగచాటుగా ఎమ్మెల్యేల్ని తీసుకెళ్లినంత సులభంగా పార్టీని తీసుకెళ్లలేరని ఒక వర్గం ఆరోపిస్తుంటే.. బాలాసాహేబ్ ఆలోచనలు కొనసాగించేది తామేనని, తమదే అసలైన శివసేనని షిండే వర్గం అంటోంది.

Devendra Fadnavis: షిండేను సీఎంగా నిర్ణయించిన వారిలో నేను ఒకడిని

ట్రెండింగ్ వార్తలు