Punjab Election : బీజేపీలో చేరితే డబ్బు,మంత్రి పదవి ఇస్తామన్నారు..ఆప్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రెసిడెండ్,ఎంపీ భగవంత్ మాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది ప్రారంభంలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బీజేపీలో చేరితే

Punjab Election :  పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రెసిడెండ్,ఎంపీ భగవంత్ మాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది ప్రారంభంలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బీజేపీలో చేరితే డబ్బు,కేంద్ర కేబినెట్ లో మంత్రి పదవి ఇస్తామని ఓ సీనియర్ బీజేపీ నేత తనకు ఆఫర్ చేశారని భగవంత్ మాన్ తెలిపారు.

పంజాబ్ లో ఏకైక ఆప్ ఎంపీ భగవంత్ మాన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ…”నాలుగు రోజుల క్రితం సీనియర్ బీజేపీ నేత నన్ను కాంటాక్ట్ అయ్యారు. మాన్ సాబ్ బీజేపీలో చేరడానికి మీరు ఏం తీసుకుంటారు?అని నన్ను అడిగారు. మీకు డబ్బులు కావాలన్నా ఇస్తాం..పార్టీలో చేరితే కేంద్రంలో మంత్రి పదవి ఇస్తాం అని బీజేపీ నేత నాకు ఆఫర్ చేశారు. అయితే నన్ను డబ్బు లేదా ఇంకేదైనా దానితో కొనలేరు అని ఆ బీజేపీ నేతకు నేను చెప్పాను. నేను ఒక మిషన్ మీద ఉన్నా..కమిషన్ మీద కాదు అని ఆ బీజేపీ నేతకు తెగేసి చెప్పా”అని భగవత్ మాన్ చెప్పారు.

అయితే ఆ బీజేపీ నేత ఎవ్వరు అన్న ప్రశ్నకు..సమయంలో వచ్చినప్పుడు ఆయన పేరు వెల్లడిస్తా అని భగవత్ మాన్ సమాధానమిచ్చారు. పంజాబ్ లో బీజేపీకి స్థానం లేదు అని ఆప్ ఎంపీ అన్నారు. గ్రామల్లోకి బీజేపీ నేతలు వెళ్లలేకపోతున్నారని, బీజేపీ నేతలు రైతుల నిరసనను ఎదుర్కొంటున్నారని అన్నారు.

కాగా, వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారంలో చేపట్టాలని ఆప్ ఉవ్విళ్లూరుతోంది. ఇందులో భాగంగానే ఆప్ అధినేత కేజ్రీవాల్ వరుస పంజాబ్ పర్యటనలు చేస్తూ అక్కడి పార్టీ కేడర్ లో ఉత్తేజం నింపుతున్నారు. పంజాబ్ ఓటర్లను ఆకట్టుకునేలా ముందుకు సాగుతున్నారు.

ALSO READ Ghulam Nabi Azad : రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు..కొత్త పార్టీ ఏర్పాటుపై ఆజాద్ కీలక వ్యాఖ్యలు!

ట్రెండింగ్ వార్తలు