Ghulam Nabi Azad : రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు..కొత్త పార్టీ ఏర్పాటుపై ఆజాద్ కీలక వ్యాఖ్యలు!

కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతున్నారా?గడిచిన కొద్ది నెలలుగా పార్టీ హైకమాండ్ దృష్టిలో రెబల్ నేతగా కొనసాగుతోన్న ఆజాద్ కాంగ్రెస్ ను వీడి సొంత పార్టీ

Ghulam Nabi Azad : రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు..కొత్త పార్టీ ఏర్పాటుపై ఆజాద్ కీలక వ్యాఖ్యలు!

Azad

Ghulam Nabi Azad : కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతున్నారా?గడిచిన కొద్ది నెలలుగా పార్టీ హైకమాండ్ దృష్టిలో రెబల్ నేతగా కొనసాగుతోన్న ఆజాద్ కాంగ్రెస్ ను వీడి
సొంత పార్టీ పెట్టబోతున్నారా? అనే ప్రశ్నలు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల కాలంలో జమ్మూకశ్మీర్ లో ఆజాద్ విస్తృతంగా పర్యటిస్తూ వరుసగా సభలు, సమావేశాలు నిర్వహిస్తుండటం, ఆయన సన్నిహితులైన 20 మంది కాంగ్రెస్ పదవులకు ఇటీవల రాజీనామా చేసిన నేపథ్యంలో సొంత పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు ఊహాగానాలు వినిపించాయి.

అయితే తాజాగా ఈ ఊహాగానాలపై  స్వయంగా స్పందించిన ఆజాద్..సోనియా,రాహుల్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూనే కొత్త పార్టీ ప్రకటనపై కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం జమ్మూకశ్మీర్ లోని రాంబాన్ సిటీలో ఓ పబ్లిక్ ర్యాలీలో పాల్గొన్న అనంతరం జాతీయ మీడియాతో ఆజాద్ మాట్లాడుతూ..తనకు కొత్త పార్టీ ఏర్పాటు చేయట్లేదని క్లారిటీ ఇచ్చారు.ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో చాలా కాలంగా నిలిచిపోయిన రాజకీయ కార్యకలాపాలను పునరుద్ధరించడం కోసమే తాను సమావేశాలు, సభలను నిర్వహిస్తున్నానని ఆజాద్ తెలిపారు.

అయితే పార్టీ పెట్టాలనే ఆలోచన ఎప్పటికీ లేదా? ప్రస్తుతానికేనా? అనే ప్రశ్నకు.. ఎప్పుడు చనిపోతామన్నది మనకు తెలియనట్లుగానే.. రాజకీయాల్లో తర్వాత ఏం జరుగుతుందనేది ఎవ్వరూ చెప్పలేరు అని బదులిచ్చారు. తాను రాజకీయాలను వదిలేద్దామనుకున్నానని,అయితే లక్షలాది మంది తన మద్దతుదారుల కోసం రాజకీయాల్లో కొనసాగుతున్నట్లు జమ్మూకశ్మీర్ మాజీ సీఎం చెప్పారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ హైకమాండ్ పై విమర్శలు గుప్పించారు ఆజాద్. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్‌ పార్టీలో విమర్శకు స్థానం ఉండేదని, కానీ ప్రస్తుత కాంగ్రెస్‌లో విమర్శకు అసలు చోటు ఉండటం లేదన్నారు. పరిస్థితులు తప్పు దారి పట్టినప్పుడు, కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఇందిరా, రాజీవ్ గాంధీలు మితిమీరిన స్వేచ్ఛ ఇచ్చేవారు. విమర్శ చేయడాన్ని ఆ ఇద్దరూ ఏనాడూ తప్పుగా చూడలేదు. కానీ ప్రస్తుత నాయకత్వం మాత్రం విమర్శను తప్పుగానే చూస్తుందన్నారు.

ఆజాద్ మాట్లాడుతూ…”రాజీవ్ గాంధీ రాజకీయాల్లో చేరినప్పుడు ఇందిరాగాంధీ మా ఇద్దర్ని పిలిచి రాజీవ్ గాంధీకి నన్ను ఇలా పరిచయం చేశారు. గులాం నబీ నా మాటను చాలా సార్లు కాదనగలరు. అలా అసమ్మతి స్వరంతో మాట్లాడటమంటే పార్టీకి అవిధేయంగా లేదా అగౌరవంతో ఉన్నట్లు కాదు. కచ్చితంగా పార్టీ మేలు కోసమే అని ఇందిర రాజీవ్ తో అన్నారు. ఇప్పుడు మాత్రం పరిస్థితి వేరు. ఇలా కాదు అని మాట్లాడితే పార్టీలోనే అపరిచితులమైపోతున్నాం”అని అన్నారు.

ALSO READ Amith Shah : 1971 భారత్-పాక్ వార్ హీరోని కలిసిన అమిత్ షా