Stock Market : షేర్ మార్కెట్ పరుగులు.. భారీ లాభాలు ఆర్జించిన టెక్, బ్యాంకింగ్ రంగాలు
దీపావళికి ముందే స్టాక్ మార్కెట్‌లో మంచి జోష్ కనిపిస్తోంది. గత కొద్దీ రోజులుగా మార్కెట్లు పరుగులు పెడుతున్నాయి.
- kunduru Vinod
- Published On : October 18, 2021 / 07:14 PM IST
Stock Market
Stock Market : దీపావళికి ముందే స్టాక్ మార్కెట్‌లో మంచి జోష్ కనిపిస్తోంది. గత కొద్దీ రోజులుగా మార్కెట్ పరుగులు పెడుతుంది. పవర్, బ్యాంకు, టెక్ షేర్లు ఆకాశమే హద్దుగా పెరిగిపోతుండటంతో సెన్సెక్స్, నిఫ్టీ పరుగులు తీస్తున్నాయి. సోమవారం స్టాక్ మార్కెట్ ప్రారంభం నుంచే పెరుగుతూ పోయింది. మరోవైపు నిఫ్టీ కూడా ఆల్‌టైం రికార్డు దిశగా దూసుకెళ్లింది. సోమవారం సెన్సెక్స్ 459 పాయింట్లు ఎగబాకి 61,765కి చేరగా.. నిఫ్టీ 138.50 పాయింట్లు పెరిగి 8,477.05 వద్ద ముగిసింది.
చదవండి : Stock Market : బుల్ పరుగులతో సరికొత్త రికార్డులు..బుల్లెట్ ట్రైన్‌లా దూసుకెళ్తున్న IRCTC షేర్
ప్రారంభ ట్రేడ్‌లో, సెన్సెక్స్ ఈ రోజు రికార్డు స్థాయిలో 61863ని తాకగా, నిఫ్టీ 18500 దాటింది. నేటి టాప్ గెయినర్‌లలో టాటాస్టీల్, ఇన్ఫోసిస్, టైటాన్, ఇండస్సింద్‌బికె, భారతీఆర్‌టిఎల్, ఎస్‌బిఐ, ఐసిఐసిబ్యాంక్, బజాఫ్ఫిన్స్వి, నెస్ట్‌లైండ్ , మారుతి ఉన్నారు. ఇన్ఫోసిస్ షేర్ వ్యాల్యూ సోమవారం ఒక్కరోజే 4.79% పెరిగింది.
చదవండి : Stock Market : మరోసారి భారీ నష్టాలు.. అత్యధికంగా నష్టపోయినవి ఇవే
