Covid Vaccine: కొవీషీల్డ్ ధరను మళ్లీ మార్చిన సీరం

కొవీషీల్డ్ వ్యాక్సిన్ ధరలో పూణెకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరో మార్పు తీసుకొచ్చింది. వ్యాక్సినేషన్ మూడో ఫేజ్ లో భాగంగా..

Serum Institute Of India To Provide Covid Vaccine Covishield

Covid Vaccine: కొవీషీల్డ్ వ్యాక్సిన్ ధరలో పూణెకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరో మార్పు తీసుకొచ్చింది. వ్యాక్సినేషన్ మూడో ఫేజ్ లో భాగంగా దేశవ్యాప్తంగా డ్రైవ్ నిర్వహించాలని ప్లాన్ చేసిన కేంద్ర ప్రభుత్వం 18ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ మే1 నుంచి వ్యాక్సిన్ ఇవ్వాలని ప్లాన్ చేశారు.

ఈ సందర్భంగా కొన్ని కోట్ల డోసులు దేశ పౌరులకు అందనుంది. ప్రస్తుతం ఎక్కువ శాతం ఆమోద యోగ్యంగా కనిపిస్తుండటంతో కొవీషీల్డ్, కొవాగ్జిన్ పైనే అందరి కళ్లు ఉన్నాయి. అయితే కొద్ది వారాలుగా ధరలలో మార్పులను ప్రకటిస్తున్న సీరం.. ముందుగా కేంద్ర ప్రభుత్వానికి రూ.150కు, రాష్ట్ర ప్రభుత్వానికి రూ.400కు, ప్రైవేట్ హాస్పిటల్స్ కు రూ.600కు అని ప్రకటించింది.

ఆ తర్వాత మళ్లీ కేంద్రానికి, రాష్ట్రానికి ఒకే రేటు అని.. రూ.400కే అందిస్తామని చెప్పింది. ఆ ధరను మరోసారి రివైజ్ చేసిన సీరం సీఈఓ రూ.300కే వ్యాక్సిన్ అందిస్తున్నట్లు ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.

‘సీరం ఇన్‌స్టిట్యూట్ దాతృత్వంతో ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వాలకు కరోనా వ్యాక్సిన్ ఒక్కో డోస్ ధరను రూ.400 నుంచి రూ.300 తగ్గించాలని ప్లాన్ చేసింది. ఈ ధరలో మార్పు వెంటనే అమల్లోకి రానుంది. ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వ నిధులు వేల కోట్ల రూపాయలు సేవ్ కానున్నాయి. దీంతో లెక్కలేనన్ని ప్రాణాలు కాపాడిన వాళ్లు అవుతాం’ అని ట్వీట్ చేశాడు.