ఏడడుగుల బెండమొక్కను చూశారా !

సాధారణంగా బెండ మొక్కలు నాలుగడుగుల నుంచి ఐదడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. ఆ తరువాత మొక్కల్లో పెరుగుదల ఆగిపోతుంది. కానీ ఓ హిందూ పాఠశాలలో నాటిన బెండమొక్కలు మాత్రం ఏడు అడుగులు దాటి పెరిగిందట. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలోని యలమంచిలిలంకలో జరిగింది.
వివరాలు.. యలమంచిలిలంకలో ఓ హిందూ పాఠశాలలో గత ఏడాది ప్రభుత్వం తరపున విత్తనాల పొట్లాలను పంపిణీ చేశారు. ఆ విత్తనాలను చల్లితే మొక్కలు ఎదిగాయని కాయలు కూడా బాగానే కాశాయని ఉపాధ్యాయుడు వి.వి.వి.సుబ్బారావు తెలిపారు. కానీ ఐదడుగుల వరకు పెరగడం సహజమని.. ఇక్కడ మాత్రం ఏడు అడుగులు దాటి ఇంకా మొక్క ఎత్తు పెరుగుతూనే ఉందని తెలిపారు. దీంతో ఉద్యానవన శాఖ అధికారులు ఈ బెండ మొక్క ఇంత ఎత్తుకు ఎదగటానికి కారణం సారవంతమైన భూమి కావటం మరియు విత్తనం మంచిది కావటం వలనే జరిగిందని చెబుతున్నారు.
ప్రకృతి ప్రసాదించిన కాయకూరల్లో బెండకాయలు ఒకటి. కనీసం వారంలో రెండు సార్లు బెండకాయలను తినడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు అందడమే కాదు, వాటి వల్ల పలు అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయని శాస్త్రవేత్తలు చెపుతున్నారు.