Covid patients Heart Attack
Heart Attack Cases : గతంలో తీవ్రమైన కొవిడ్ ఇన్ఫెక్షన్ తో బాధపడిన వారు ఇటీవల గుండెపోటుకు గురై మరణిస్తున్నారు. గుండెపోటుతో మరణాల సంఖ్య ఆగడం లేదు. పలు రాష్ట్రాల్లో యువకులు, మధ్య వయస్కులు మృత్యువాత పడుతున్నారు.గతంలో కొవిడ్ బారిన పడిన వారు జిమ్ లో వ్యాయామం చేస్తూ, నృత్యం చేస్తూ, ఆటలు ఆడుతూ ఆకస్మికంగా గుండెపోటుకు గురై మరణిస్తున్నారు.
Also Read : Indian woman Anju : పిల్లల్ని చూసేందుకు పాక్ నుంచి భారత్ రానున్న అంజూ
గుజరాత్ రాష్ట్రంలో ఇటీవల పలు గుండెపోటు మరణాలు సంభవించాయి. గతంలో కరోనా సోకి కోలుకున్న వారిలో యువకులు, మధ్య వయస్కులు మృత్యువాత పడుతున్నారు. సౌరాష్ట్రలో గుండెపోటు మరణాల సంఖ్య ఇటీవల పెరగడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఎక్కువగా యువత గుండెపోటుకు గురవుతుండటంపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) పరిశోధనలు జరిపింది.
Also Read : Jammu and Kashmir: : జమ్మూకశ్మీరులో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం, చొరబాటు యత్నం విఫలం.. బంకర్లు సిద్ధం
తీవ్రమైన కొవిడ్ మహమ్మారితో బాధపడి కోలుకున్న వారు సంవత్సరం లేదా రెండు సంవత్సరాల పాటు కష్టపడి పనిచేయకూడదని ఐసీఎంఆర్ పరిశోధనల్లో తేలిందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా చెప్పారు. అక్టోబర్ 22 వతేదీన కపద్వాంజ్ ఖేడా జిల్లాలో గర్బా నృత్యం చేస్తున్నప్పుడు 17 ఏళ్ల బాలుడు అకస్మాత్తుగా గుండెపోటుతో నేలకొరిగి మరణించాడు. వీర్ షా అనే 17 ఏళ్ల బాలుడు కపద్వాంజ్‌లోని గర్బా గ్రౌండ్‌లో గర్బా నృత్యం చేస్తూ మరణించాడని డాక్టర్ ఆయుష్ పటేల్ చెప్పారు.
కష్టపడి పనిచేయొద్దు…కఠిన వ్యాయామాలు చేయొద్దు : కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి సూచన
తీవ్రమైన కొవిడ్-19 ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న వ్యక్తులు గుండెపోటును నివారించడానికి కొంతకాలం కష్టపడి పనులు చేయరాదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి సూచించారు. కొవిడ్ బారిన పడి కోలుకున్న వారు రెండేళ్లపాటు కఠినమైన వ్యాయామాలు చేయకూడదని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా చెప్పారు. తీవ్రమైన కొవిడ్ ఇన్ఫెక్షన్ తో బాధపడిన పేషెంట్లు అధిక పనికి దూరంగా ఉండాలని ఆరోగ్య మంత్రి చెప్పారు.
ఐసీఎంఆర్ పరిశోధనల్లో ఏం తేలిందంటే…
కేంద్ర ఆరోగ్య మంత్రి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ రీసెర్చ్‌ను ఉదహరించారు. ఇటీవల ఖమ్మం నగరంలోనూ వ్యాయామం చేస్తూ ఓ యువకుడు గుండెపోటుతో మృతి చెందారు. యువత గుండెపోటు మరణాలపై ఉత్తరప్రదేశ్ గవర్నర్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు.
రెండేళ్ల పాటు శ్రమించవద్దు: వైద్యనిపుణులు
గుండెపోటును నివారించడానికి ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాల పాటు తమను తాము ఎక్కువగా శ్రమించకూడదని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. రాష్ట్ర ఆరోగ్య మంత్రి రుషికేశ్ పటేల్ కార్డియాలజిస్టులతో సహా వైద్య నిపుణులతో సమావేశాన్ని నిర్వహించారు. రుషికేష్ పటేల్ మరణాలకు కారణాలు తెలుసుకోవడానికి నిపుణుల డేటాను సేకరించాలని నిర్ణయించారు.
ముందుజాగ్రత్త చర్యలు
గుండెపోటు మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలో గుజరాత్ రాష్ట్రంలో ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. గుజరాత్ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నోటిఫికేషన్ ద్వారా గర్బా ఈవెంట్ నిర్వాహకులు పాల్గొనేవారికి తక్షణ వైద్య సహాయం అందించడానికి అంబులెన్స్, వైద్య బృందాన్ని వేదిక వద్ద మోహరించడాన్ని తప్పనిసరి చేసింది.