Supreme Court : మహిళా జడ్జిని ఐటెం సాంగ్ చేయాలని వేధించిన న్యాయమూర్తి‌’ : సుప్రీంకోర్టు కీలక తీర్పు

మహిళా జడ్జిని ఐటెం సాంగ్ చేయాలని..లైంగికంగా వేధించిన హైకోర్టు న్యాయమూర్తి‌’ ఆరోపణల కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది.

Woman Judge..Item Song case : కేవలం సినిమా పరిశ్రమలోనే కాదు..ఇతర సంస్థల్లోనే కాదు సాక్షాత్తు న్యాయవ్యవస్థలో కూడా లైంగిక వేధింపులు ఉంటాయి అనటానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది ఓ మహిళా జడ్జీని హైకోర్టు జడ్జీ వేధించిన ఘటన. ‘న్యాయవ్యవస్థలో ఐటెం సాంగ్​ మరక’గా దేశవ్యాప్తంగా ప్రచారం అయిన కేసు విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది.సదరు మహిళా జడ్జికి ఊరటనిచ్చే తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు..సీనియర్ న్యాయవాదులు ఇందిరా జైసింగ్ చేసిన వివరణాత్మక వాదనలను విన్న సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చింది.

Also read : Karnataka Hijab : కర్ణాటక హిజాబ్ వివాదం..ముస్లిం మహిళలను చిన్న చూపు చూడొద్దన్న మలాలా

హైకోర్టు న్యాయమూర్తి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, ఐటెం సాంగ్​కు తనను డ్యాన్స్ వేయాలని వేధించారని ఆరోపిస్తూ.. దిగువ స్థాయి కోర్టు మహిళా జడ్జి ఆరోపించారు. ఆ వేధింపులు భరించలేనంతగా ఉన్నాయని అందుకే వేరే దారి లేక మహిళా జడ్జి వాపోతూ..2014లో రాజీనామా చేశారు.మధ్యప్రదేశ్​లో జరిగిన ఈ ఈరోపణల ఘటన ‘న్యాయవ్యవస్థలో ఐటెం సాంగ్​ మరక’గా దేశవ్యాప్తంగా ప్రచారమయ్యింది. ఈ కేసులో 2014లో రాజీనామా చేసిన ఆమెను.. తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు గురువారం (ఫిబ్రవరి 10,2022) మధ్యప్రదేశ్​ హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది.

2014లో మహిళా న్యాయమూర్తి బలవంతంగా రాజీనామా చేయవలసి వచ్చిందని..కాబట్టి ఆమెను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ బిఆర్ గవాయిలతో కూడిన ధర్మాసనం ఆమె రాజీనామాను ఆమోదిస్తూ ఉత్తర్వులను కొట్టివేసింది. రాజీనామాను స్వచ్చంద విరమణ కింద పరిగణించకూడదంటూ కోర్టు మధ్యప్రదేశ్​ హైకోర్టుకు సూచించింది. అంతేకాదు మధ్యప్రదేశ్​ హైకోర్టు ఆమోదించిన ఆమె రాజీనామాను కొట్టేస్తున్నామని జస్టిస్​ గవాయ్​ తెలిపారు.

Also read : Sumanth : రాజకీయాల్లో చిన్నప్పటి నుంచి ఇదే చూస్తున్నాం.. పవన్, జగన్ పై మాట్లాడిన సుమంత్..

ఈ కేసు పూర్తి వివరాల్లోకి వెళితే..జూలై 2014లో..అదనపు జిల్లా న్యాయమూర్తిగా ఉన్న బాధిత జడ్జి హైకోర్టు జడ్జి తనను లైంగికంగా వేధిస్తున్నారని..తనను లైంగికంగా వేధించారని ఆరోపించారు. తనకు జరిగిన ఈ వేధింపులపై తీవ్ర మనస్తాపం చెందిన ఆమె రాష్ట్రపతి, సుప్రీం ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర న్యాయశాఖ మంత్రికి లేఖలు రాసారు. ఆ తర్వాత ఆమె గ్వాలియర్‌లోని అదనపు జిల్లా జడ్జి పదవికి రాజీనామా చేశారు.

ఓ ఐటెం సాంగ్‌కు తనను డ్యాన్స్ చేయాలని హైకోర్టు జడ్జి వేధించారని లేఖలో పేర్కొన్నారామె. తను చెప్పినమాట వినకపోతే తనను దూర ప్రాంతానికి ట్రాన్స్ ఫర్ చేసేలా న్యాయమూర్తి ప్రభావితం చేశారని ఆమె ఆరోపించారామె. ఏకంగా మహిళా జడ్జీపైనే ఓ న్యాయమూర్తిగా ఉన్న వ్యక్తి లైంగిక వేధింపులు చేసినట్లుగా వచ్చిన ఈ రోపణల వ్యవహారం దేశవ్యాప్తంగా అప్పట్లో దుమారం రేపింది. ఈఆరోపణలపై దీంతో సదరు జడ్జికి సుప్రీం నోటీసులు కూడా జారీ అయ్యాయి. అంతేకాదు లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ కోసం రాజ్యసభ తరపున ఒక ప్యానెల్ నియమించారు. ఈ ప్యానెల్​ గత ఏడాది డిసెంబర్‌లో నివేదిక ఇస్తూ.. సదరు హైకోర్టు న్యాయమూర్తికి క్లీన్ చిట్ ఇచ్చింది.ఫిర్యాది మహిళను వేధించడానికి న్యాయమూర్తి తన పదవిని దుర్వినియోగం చేశారనే అభియోగంలో ఎటువంటి ఆధారం లేదని ప్యానెల్​ తెలిపింది.

Also read : Supreme Court: వరకట్న వేధింపుల నిరోధక చట్టం దుర్వినియోగం అవుతోంది -సుప్రీంకోర్టు

ఈ పరిణామాల తర్వాత.. ఆరోపణలు చేసిన మహిళ.. తనను తిరిగి విధుల్లోకి చేర్చుకోవడాన్ని పరిశీలించాలని ఆమె న్యాయస్థానాలను ఆశ్రయించారు. అయితే హైకోర్టులో ఆమెకు చుక్క ఎదురు కాగా..ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించగా..సీనియర్ న్యాయవాదులు ఇందిరా జైసింగ్ చేసిన వివరణాత్మక వాదనలను విన్న సుప్రీంకోర్టు “న్యాయవ్యవస్థలో లైంగిక వేధింపులు చూడటం బాధాకరం” అని వ్యాఖ్యానిస్తు..ఆమెను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని తీర్పునిచ్చింది.

 

ట్రెండింగ్ వార్తలు