Supreme Court: వరకట్న వేధింపుల నిరోధక చట్టం దుర్వినియోగం అవుతోంది -సుప్రీంకోర్టు

వరకట్న వేధింపుల నుంచి రక్షణ కల్పించేందుకు చట్టంలో చేర్చిన "ఐపీసీ సెక్షన్ 498ఏ"ని ఆయుధంగా ఉపయోగిస్తున్నట్లు సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

Supreme Court: వరకట్న వేధింపుల నిరోధక చట్టం దుర్వినియోగం అవుతోంది -సుప్రీంకోర్టు

Covid In Supreme Court..10 Judges Positive

Supreme Court: వరకట్న వేధింపుల నుంచి రక్షణ కల్పించేందుకు చట్టంలో చేర్చిన “ఐపీసీ సెక్షన్ 498ఏ”ని ఆయుధంగా ఉపయోగిస్తున్నట్లు సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ ఆయుధాన్ని భర్త, అతని కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేందుకు ఎక్కువ శాతం ఉపయోగిస్తున్నారని చెప్పుకొచ్చింది సుప్రీంకోర్టు.

బీహార్‌కు చెందిన ఓ మహిళ తన అత్తమామలపై వరకట్న వేధింపుల కేసును వెయ్యగా.. దానిని సుప్రీంకోర్టు కొట్టివేసింది. భర్తపై మాత్రం కేసు కొనసాగుతుంది. ఈ కేసు విచారణ సంధర్భంగా అత్యుత్తమ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

మధుబని అనే మహిళ 2017లో పూర్నియాకు చెందిన మహ్మద్ ఇక్రమ్‌ను వివాహం చేసుకుంది. పెళ్లయిన కొన్ని నెలలకే భర్త, అత్తమామలపై ఆమె వరకట్న వేధింపులు, దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ కేసు పెట్టింది. అయితే, అత్తమామలపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని పూర్నియా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అభిప్రాయపడి కుటుంబ సభ్యుల పేర్లను కేసు నుంచి తొలగించింది. ఇరువర్గాలు ఒక అంగీకారానికి రావడంతో అప్పట్లో విషయం ముగిసింది.

అయితే, 2019లో, మళ్లీ ఆ మహిళ తన భర్త, అత్తగారు, బావమరిది, జెథాని, మేనకోడలు సహా 7 మందిపై వరకట్నం కేసు పెట్టింది. కారు కోసం డిమాండ్ చేస్తున్నారని, తనను అబార్షన్ చేయించుకోమని బెదిరించారంటూ కేసు నమోదు చేసింది.

ఈ ఎఫ్‌ఐఆర్‌లో, సెక్షన్‌లు 498A(కట్నం కోసం భర్త, అతని బంధువుల క్రూరత్వం), సెక్షన్‌ 341 (ఇంట్లో బంధీని చేయడం), 323 (బాధ పెట్టడం), 354 (స్త్రీ గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలు), బలవంతం చెయ్యడం, దొంగతనం వంటి సెక్షన్లు కింద కూడా ఆమె కేసులు పెట్టారు.

అయితే, ఈ ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని నిందితులందరూ పాట్నా హైకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు తిరస్కరించింది. అనంతరం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎస్ అబ్దుల్ నజీర్, కృష్ణ మురారిలతో కూడిన ధర్మాసనం తన అత్తమామలపై మహిళ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని అంగీకరించింది. కేసులైతే పెట్టారు కానీ, అసలు ఎవరు ఏం చేశారు? అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. ఎలాంటి ఆధారం లేకుండా అందరిపై కేసు పెట్టినట్లు తెలుస్తోంది అని సుప్రీంకోర్టు అభిప్రాయపపడింది.

ఈ సంధర్భంగా సుప్రీంకోర్టు సెక్షన్ 498ఎ దుర్వినియోగం అవుతోంది అని అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు ఇంతకుముందు కూడా చాలా సందర్భాలలో ఇదే విషయమై ఆందోళన వ్యక్తం చేసింది. వరకట్న వేధింపుల వ్యతిరేక చట్టం కింద తప్పుడు కేసులు భారీగా నమోదు అవుతుండడంతో 2017లో ఈ చట్టం దుర్వినియోగం కాకుండా అడ్డుకోవాలని సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించిన విషయాన్ని కూడా ఈ సంధర్భంగా ప్రస్తావించింద కోర్డు.