Corona Compensation
Corona Compensation : కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం రూ.50 వేల పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సంబంధిత అధికారులు మృతుల వివరాలు సేకరించారు. అయితే వివరాల సేకరణలో ఓ చోట పొరపాటు జరిగింది. కరోనా నుంచి కోలుకొని సాధారణ ఆరోగ్యంగా ఉన్న ఓ మహిళ మృతి చెందినట్లుగా పొరబడ్డారు అధికారులు. మృతుల లిస్టులో చేర్చారు. పరిహారం కోసం ఫోన్ చేయడంతో అసలు విషయం బయటపడింది. కాగా ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో చోటుచేసుకుంది.
చదవండి : Telangana Corona : థర్డ్ వేవ్‌కు సంకేతం ఇదే…అప్రమత్తంగా ఉండాలి
శకుంతల దేవి అనే మహిళ కొద్దీ నెలల క్రితం కరోనా సోకడంతో ఆసుపత్రిలో చేరింది. అయితే కొద్దీ రోజులకే కరోనా నుంచి కోలుకొని ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే అధికారులు శకుంతల దేవి నెంబర్‌కి ఫోన్ చేసి.. కరోనా మృతుల వివరాల్లో మీ కుటుంబ సభ్యుల పేరు ఉందని.. డెత్ సర్టిఫికెట్ సడ్మిట్ చెయ్యాలని కోరారు. ఫోన్‌లో అధికారి తనపేరు చెప్పడంతో శకుంతల దేవి బిత్తరపోయింది. తన నెంబర్‌కి ఫోన్ చేసి బతికుండగానే డెత్ సర్టిఫికెట్ ఇవ్వమంటున్నారని ఆశ్చర్యపోయి.. తానే శకుంతల అని అధికారులకు చెప్పింది.
చదవండి : Covid Compensation Portal : కోవిడ్ పరిహారం కోసం కొత్త పోర్టల్ తెచ్చిన ఏపీ.. దరఖాస్తు తప్పనిసరి
ఫోన్ కట్ చేసిన అధికారులు ఆలోచనలో పడ్డారు. ఫోన్ కట్ చేసి మృతుల వివరాలను పరిశీలించారు. డేటా సేకరణలో తప్పు దొర్లినట్లు ద్రువీకరించుకొని వెంటనే ఆమె పేరును మృతుల లిస్టు నుంచి తొలగించారు. ఇందుకు సంబందించిన వివరాలను నోడల్ అధికారి రాహుల్ కులశ్రేష్ఠ మీడియాకు తెలిపారు. కిందిస్థాయి అధికారుల పొరపాటు వల్లే ఇది జరిగిందని తెలిపారు.