సిగ్గనిపించడం లేదా : ప్రజ్ఞా ఠాకూర్ ని నిలదీసిన ప్యాసెంజర్..వీడియో

బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ కు షాక్ తగిలింది. ఓ ప్యాసెంజర్ ఆమెను నిలదీశారు. ప్రజలకు అనూకలంగా వ్యవహరించాల్సి ఉంటే..ఇలా చేస్తారా అంటూ నిలదీశాడు. దీనికంతటికీ కారణం ఉంది. ఎంపీ ప్రజ్ఞా కారణంగా విమానం ఆలస్యంగా బయలుదేరడమే. 2019, డిసంబర్ 22వ తేదీ ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ – భోపాల్ విమానం సుమారు 45 నిమిషాల పాటు ఆలస్యంగా బయలుదేరింది. దీనిపై ఎంపీని నిలదీసిన దృశ్యాలు 2019, డిసెంబర్ 23వ తేదీ సోమవారం ట్వీట్ చేయడంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
అసలేం ఏం జరిగింది : –
భోపాల్ వేళ్లేందుకు స్పైస్‌జెట్ విమానంలో టికెట్ బుక్ చేసుకున్నారు ప్రజ్ఞా… అయితే ఆమె వీల్ చైర్‌లో రావడంతో విమానం ముందువరసలోని ఏ-1 సీటును కేటాయించేందుకు విమాన సిబ్బంది నిరాకరించారు. నాన్ ఎమర్జన్సీ వరుసలోని సీటుకు మారాలని ఆమెను కోరాగా..దానికి ప్రజ్ఞా నిరాకరించడంతో…విమానంలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. వెనుక సీట్లో కూర్చొన్న ప్యాసెంజర్ కు చిర్రెత్తుకొచ్చింది.
ప్రజలకు ప్రతినిధి అయిన..వారు ఇలా వ్యవహరించ వచ్చా అని ప్రశ్నించారు. ప్రజలను ఇబ్బంది పెట్టడం కరెక్టేనా అంటూ మరో ప్రశ్న సంధించాడు. తాను ఎకనామీ క్లాస్ లో ఎందుకు వెళుతున్నా..నేను తలుచుకుంటే..ఫస్ట్ క్లాస్ లో వెళ్లగలను అంటూ అన్నారు ప్రజ్ఞా. మీ వల్ల ఒక్క సిటిజన్ ఇబ్బంది పడకూడదు. మీకు సిగ్గులా అనిపించడం లేదా అంటూ మరో పంచ్ విసిరారు.
దుర్బాషలాడవద్దని సూచించారు సదరు ఎంపీ. తాను కరెక్టుగానే మాట్లాడుతున్నా అంటూ..ప్రయాణీకుడు చెప్పడంతో దీంతో ఎంపీ షాక్ కు గురయ్యారు. ..దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఇది కాస్తా వైరల్ అవుతోంది.
ప్రజ్ఞా ఫిర్యాదు : –
మరోవైపు…ఈ విషయంపై భోపాల్ ఏయిర్‌పోర్ట్ డైరెక్టర్‌కు ప్రజ్ఞా ఫిర్యాదు చేశారు. స్పైస్‌జెట్ సిబ్బంది తనతో అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. ప్రజ్ఞాసింగ్ ఫిర్యాదును 2019, డిసెంబర్ 23వ తేదీ సోమవారం పరిశీలించనున్నట్టు భోపాల్ ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ అనిల్ విక్రమ్ తెలిపారు.
“Shame is a good word.”
Watch how a common man schools MP Pragya Thakur on how to behave like a good leader. Someone should find this guy and give him an award! pic.twitter.com/biKSGEJxu7— Voice Of Ram (@VORdotcom) December 23, 2019