Sharad Pawar On Arrests By Central Agencies
Sharad Pawar: కేంద్ర దర్యాప్తు సంస్థల్ని కేంద్ర ప్రభుత్వం ఇష్టారీతిన తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటోందని, మహా వికాస్ అగాఢీ నేతల అరెస్టే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ ఆరోపించారు. ఎన్సీపీ సీనియర్ నేత, మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఏడాది అనంతరం జైలు నుంచి విడుదలైన అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ పవార్ ఇలా వ్యాఖ్యానించారు. అనిల్ దేశ్‌ముఖ్, సంజయ్ రౌత్ సహా ఎంవీఏలోని ఇతర నేతలపై జరిగిన దర్యాప్తులను ఆయన ఊటంకించారు. ఈ విషయమై తాను తొందరలోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలవనున్నట్లు పవార్ తెలిపారు.
Maha vs Karnataka: ముంబై ఎవడి బాబు సొత్తు కాదు, అదెప్పటికీ మహారాష్ట్రదే.. డిప్యూటీ సీఎం ఫడ్నవీస్
‘‘భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఎవరికీ రాకుండా ఉండేందుకు నేను తొందరలోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలుస్తాను’’ అని అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రతిపక్షాల్ని అణచివేసేందుకే ఉపయోగపడుతన్నాయని, రాజకీయ కక్షసాధింపులకు వాటిని ఇష్టారీతిన ఉపయోగించుకుంటున్నారని పవార్ ఆరోపించారు.
Sanjay Raut: వీడియో కాన్ఫరెన్స్లో ఉద్ధవ్ థాకరే గురంచి పుతిన్, బైడెన్, కింగ్ చార్లెస్ చర్చించారట!
మనీ లాడరింగ్ కేసులో అరెస్టైన అనిల్ దేశ్‌ముఖ్, ఏడాది జైలు జీవితం అనంతరం బుధవారం ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు నుంచి విడుదలయ్యారు. ఇక ఈ ఏడాది ప్రారంభంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సైతం జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఆయన నవంబరులో బెయిల్ లభించడం ద్వారా బయటికి వచ్చారు. ఈయన కూడా మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ అనంతరం ఈ ఇరువురు నేతలు జైలుకు వెళ్లారు.