Gujarat Election Results: నిరాశలో కాంగ్రెస్ నేతలు… ఒకరి రాజీనామా

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి హోదాకు రఘు శర్మ రాజీనామా చేశారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆయన రాజీనామా లేఖ పంపారు. మరోవైపు, ‘‘నేను గుజరాత్ స్టార్ క్యాంపెయినర్ గా కొనసాగలేదు. అలాగే, ఆ రాష్ట్రంలో ప్రచారంలోనూ నేను పాల్గొనలేదు. దీంతో, ఈ ఫలితాలపై స్పందన ఏంటని మీరు అడుగుతున్న ప్రశ్నకు సమాధానం ఇవ్వడం నాకు క్లిష్టతరం’’ అని శశి థరూర్ అన్నారు.

Gujarat Election Results: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి హోదాకు రఘు శర్మ రాజీనామా చేశారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆయన రాజీనామా లేఖ పంపారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ఓడిపోయినందుకు నేను పూర్తి నైతిక బాధ్యత వహిస్తున్నాను. పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి హోదాకు రాజీనామా చేస్తున్నాను. దయచేసి నా రాజీనామాను అంగీకరించండి’’ అని ఆయన పేర్కొన్నారు.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ హోదాలో కొనసాగడానికి ఆ పార్టీ సీనియర్ నేత శశి థరూర్ కు హస్తం పార్టీ అధిష్ఠానం అవకాశం ఇవ్వలేదు. ఆ పార్టీ గుజరాత్ లో ఘోరంగా ఓడిపోవడంతో ఈ విషయంపై ఆయన స్పందనను మీడియా అడగగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘నేను గుజరాత్ స్టార్ క్యాంపెయినర్ గా కొనసాగలేదు. అలాగే, ఆ రాష్ట్రంలో ప్రచారంలోనూ నేను పాల్గొనలేదు. దీంతో, ఈ ఫలితాలపై స్పందన ఏంటని మీరు అడుగుతున్న ప్రశ్నకు సమాధానం ఇవ్వడం నాకు క్లిష్టతరం’’ అని శశి థరూర్ అన్నారు. గుజరాత్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ నేతలు నిరాశలో ఉన్నారు.

మరోవైపు, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందినందుకు మాత్రం పలువురు నేతలు హర్షం వ్యక్తం చేశారు. తమ పార్టీ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రా చేసిన ప్రచారం ప్రభావం చూపిందని చెప్పారు.

Gujarat Polls: ఈవీఎం ట్యాంపరింగ్ అని ఆరోపణలు చేస్తూ కౌంటింగ్ కేంద్రం వద్దే ఆత్మహత్యాయత్నం చేసిన కాంగ్రెస్ నేత

ట్రెండింగ్ వార్తలు