Gujarat Polls: ఈవీఎం ట్యాంపరింగ్ అని ఆరోపణలు చేస్తూ కౌంటింగ్ కేంద్రం వద్దే ఆత్మహత్యాయత్నం చేసిన కాంగ్రెస్ నేత
182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 157 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మెజారిటీ మార్క్ 92 స్థానాలే అయినప్పటికీ దాదాపుగా అసెంబ్లీ ఎన్నికలను వైట్ వాష్ చేసింది బీజేపీ. కాంగ్రెస్ పార్టీ కేవలం 16 స్థానాల్లో మాత్రం ఆధిక్యం కొనసాగిస్తోంది. అయితే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పార్టీ 150 స్థానాలకు మించి గెలవడం ఇదే తొలిసారి. 1985లో కాంగ్రెస్ పార్టీ 149 స్థానాలతో ఉన్న రికార్డును బీజేపీ తాజాగా అధిగమించింది.

Gujarat Congress Candidate, Alleging EVM Tampering, Ties Noose Around Neck
Gujarat Polls: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు జరుగుతుండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక అభ్యర్థి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈవీఎం మిషిన్ల ట్యాంపరింగ్ జరిగిందంటూ కౌంటింగ్ కేంద్రం వద్దే తన మెడలో ఉన్న రుమాలు బిగపట్టి ఆత్మహత్యకు పాల్పడబోయారు. అక్కడే ఉన్న కౌంటింగ్ సిబ్బంది సహా ఇతరులు ఆయన యత్నాన్ని ఆపారు.
భారత్‌భాయి వెల్జిభాయి సోలంకి అనే కాంగ్రెస్ నేత గాంధీధన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్దకు వచ్చిన ఆయన, లెక్కింపు జరుగుతుండగా మొదట నిరసనకు కూర్చున్నారు. అనంతరం అతని మెడలో ఉన్న రుమాలుతో మెడను అదిమి పట్టుకున్నారు. లెక్కింపు ఆపకపోతే చనిపోతానని అరవడం ప్రారంభించాడు.
Results: ఎగ్టాక్ట్ పోల్స్‌కు దూరంగా ఎగ్జిట్ పోల్స్.. అంచనాలను ఏమాత్రం అందుకోలేని సర్వేలు
లెక్కింపులో గాంధీధన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మల్టి కిశోర్ మహేశ్వరి లీడింగులో ఉన్నారు. బీజేపీ అభ్యర్థికి చాలా దూరంలో సోలంకి ఉన్నారు. దాదాపుగా ఆయన ఓటమి ఖాయమైంది. ఈ తరుణంలోనే ఆత్మహత్యాయత్నం చేశారు.
182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 157 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మెజారిటీ మార్క్ 92 స్థానాలే అయినప్పటికీ దాదాపుగా అసెంబ్లీ ఎన్నికలను వైట్ వాష్ చేసింది బీజేపీ. కాంగ్రెస్ పార్టీ కేవలం 16 స్థానాల్లో మాత్రం ఆధిక్యం కొనసాగిస్తోంది. అయితే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పార్టీ 150 స్థానాలకు మించి గెలవడం ఇదే తొలిసారి. 1985లో కాంగ్రెస్ పార్టీ 149 స్థానాలతో ఉన్న రికార్డును బీజేపీ తాజాగా అధిగమించింది.
By Poll: మెయిన్‌పురి లోక్‌సభ నుంచి డింపుల్ యాదవ్ ఘన విజయం!