By Poll: మెయిన్‭పురి లోక్‭సభ నుంచి డింపుల్ యాదవ్ ఘన విజయం!

ములాయం సింగ్ యాదవ్ మరణంతో మెయిన్‭పురి లోక్‭సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఏర్పడింది. ముందుగా పార్టీ నుంచి ఎవరినైనా పోటీ చేయిద్దామని అనుకున్నప్పటికీ, చర్చల అనంతరం డింపుల్ యాదవ్ వైపుకు మొగ్గు చూపారు. ముందస్తు అంచానాలకు అనుగుణంగానే ఫలితాల్లో ఎస్పీ విజయం వైపు పరుగులు తీస్తోంది

By Poll: మెయిన్‭పురి లోక్‭సభ నుంచి డింపుల్ యాదవ్ ఘన విజయం!

Dimple Yadav leads by over 2.5 lakh votes in Mainpuri Lok Sabha seat

By Poll: సమాజ్‭వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సతీమరణి డింపుల్ యాదవ్ విజయం వైపుకు దూసుకు వెళ్తున్నారు. మెయిన్‭పురి లోక్‭సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమెకు తాజాగా విడుదలవుతున్న ఎన్నికల ఫలితాల్లో అనుకూలత కనిపిస్తోంది. సాయంత్రం 4:00 గంటల వరకు విడుదలైన ఫలితాలను బట్టి ప్రస్తుతం ఆమె బీజేపీ అభ్యర్థి రఘురాజ్ సింగ్ శాక్యపై 2,40,322 ఓట్ల మెజారిటీతో మొదటి స్థానంలో ఉన్నారు. ఇప్పటికి విడుదలైన ఫలితాల ప్రకారం.. ఎస్పీకి 64 శాతానికి పైగా ఓట్ బ్యాంక్ ఉంది. బీజేపీకి కేవలం 34 శాతం ఓట్ బ్యాంక్ మాత్రమే సాధించింది. లెక్కింపు ముగిసే నాటికి మెజారిటీ మరింత పెరిగి డింపుల్ యాదవ్ గెలుపు ఖరారు అవుతుందని అంటున్నారు.

Results: ఎగ్టాక్ట్ పోల్స్‭కు దూరంగా ఎగ్జిట్ పోల్స్.. అంచనాలను ఏమాత్రం అందుకోలేని సర్వేలు

ములాయం సింగ్ యాదవ్ మరణంతో మెయిన్‭పురి లోక్‭సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఏర్పడింది. ముందుగా పార్టీ నుంచి ఎవరినైనా పోటీ చేయిద్దామని అనుకున్నప్పటికీ, చర్చల అనంతరం డింపుల్ యాదవ్ వైపుకు మొగ్గు చూపారు. ముందస్తు అంచానాలకు అనుగుణంగానే ఫలితాల్లో ఎస్పీ విజయం వైపు పరుగులు తీస్తోంది. ఎస్పీకి ఎంతో బలమైన ప్రాంతం, పైగా ములాయం మరణంతో ప్రజల్లో ఏర్పడిన సానుభూతి కారణంగా ఎస్పీకే గెలుపు అవకాశాలు ఉన్నట్లు అంచనాలు వచ్చాయి. అంతే కాకుండా, యూపీలో ప్రధాన పార్టీల్లో ఒకటైన బహుజన్ సమాజ్ పార్టీ ఈ ఎన్నికకు దూరంగా ఉండడం కూడా ఎస్పీకి కలిసి వచ్చింది. గతంలో కూడా ఇలాంటి ఫార్ములా వర్కౌట్ అయింది.