తిరగబడిన తులాభారం : శశి థరూర్‌కి గాయాలు

  • Publish Date - April 15, 2019 / 08:45 AM IST

తులాభారంలో అపశృతి చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్‌కు గాయాలయ్యాయి. తులాభారం నిర్వహిస్తుండగా బ్యాలెన్స్ తప్పింది. ఇనుప కడ్డి ఆయనపై పడడంతో తలకు తీవ్ర గాయమై రక్తస్రావమైంది. వెంటనే ఆయన్ను తిరువనంతపురంలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు శస్త్రచికిత్స చేశారు. తలకు 10 కుట్లు వేసినట్లు..ఆందోళన పడాల్సిన అవసరం లేదని వైద్యులు వెల్లడించారు. గాయం కావడంతో ఎన్నికల ర్యాలీ క్యాన్సిల్ అయ్యింది. 
Read Also : 50% vvpats లెక్కింపుపై మళ్లీ కోర్టుకెళతాం : చంద్రబాబు

తిరువనంతపురం లోక్ సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా శశి థరూర్ పోటీ చేస్తున్నారు. గాంధారి అమ్మాన్ టెంపుల్‌ను ఆయన తరచూ దర్శిస్తుంటారు. కేరళలో ఉగాది (విషు డే) జరుగుతోంది. ఈ సందర్భంగా ఆలయానికి శశి థరూర్ వచ్చారు. పండుగ పూట అరటి పండ్లతో తులాభారం ఇస్తుంటారు. శశి థరూర్ కూడా తులాభారానికి ఏర్పాట్లు చేశారు. తక్కెడలో ఓ వైపు అరటిపండ్లు ఉంచగా..మరోవైపు శశిథరూర్ కూర్చొన్నారు.
Read Also : టీడీపీ ప్రభుత్వమే పక్కా : మళ్లీ బాబే సీఎం – డొక్కా

తక్కెడ పైకి లేచిన తరువాత బ్యాలెన్స్ తప్పింది. ఆయన కిందపడిపోయారు. ఇనుప కడ్డీ థరూర్ తలపై పడింది. తిరువంతపురంలోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వైద్యులు శశి థరూర్‌కి చికిత్స అందించారు. మూడో దశలో భాగంగా ఏప్రిల్ 23వ తేదీన కేరళలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. 

Read Also : గెలుపుపై అనుమానాలు లేవు, 150కిపైగా సీట్లు ఖాయం : చంద్రబాబు ధీమా

ట్రెండింగ్ వార్తలు