దర్శనానికి వెళ్లొచ్చు : షిర్డీ ఆలయం మూసివేయడం లేదు

  • Publish Date - January 18, 2020 / 05:51 AM IST

షిర్డీ ఆలయం మూసివేస్తారనే జరుగుతున్న ప్రచారాన్ని షిర్డీ సంస్థాన్ ఖండించింది. ఈ మేరకు 2020, జనవరి 18వ తేదీ శనివారం 10tvకి సమాచారం అందించారు. షిర్డీ సంస్థాన్ బోర్డు నుంచి అధికారికంగా ప్రకటించారు. నిత్య సేవలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. ఈ నేపథ్యంలో…ఆలయాన్ని తాము మూసివేయడం లేదని, జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు.

ఆలయానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతారని, షిర్డీకి ఉన్న ప్రాశస్త్ర్యం తగ్గిపోకుండా ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని వెల్లడించింది. షిర్డీలో కొలువైన సాయిబాబా జన్మస్థలమైన పాథ్రీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు రూ. 100 కోట్ల రూపాయలు కేటాయిస్తామని సీఎం ఉద్దవ్ థాక్రే ప్రకటించడం వివాదాస్పమైంది. సీఎం నిర్ణయంపై షిర్డీలోని సాయిబాబా సంస్థాన్ ట్రస్టు ఫైర్ అయ్యింది.

పాథ్రీకి సాయి మందిరాన్ని తరలించే విధంగా ప్రభుత్వం కుట్ర చేస్తోందని, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే షిర్డీకి భక్తుల రాక తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. బాబా జన్మభూమిని ఏ రాజకీయ నాయకుడు నిర్ధారించలేడని వెల్లడించింది. తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు 2020, జనవరి 18వ తేదీ శనివారం షిర్డీ గ్రామస్థులంతా సమావేశం కానున్నారు. 

Read More : JNU అధ్యక్షురాలు ఐషే ఘోష్‌పై తల్లి ఆసక్తికర వ్యాఖ్యలు