రాహుల్ పై ఒబామా వ్యాఖ్యాలను ఖండించిన శివసేన

Shiv Sena Defends Rahul Gandhi కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్ గాంధీపై అమెరికా మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా చేసిన వ్యాఖ్య‌ల‌ను శివ‌సేన ఖండించింది. భార‌త‌దేశానికి చెందిన రాజకీయ నాయకులపై ఒక విదేశీ నేత అలాంటి అభిప్రాయాలు వెల్ల‌డించ‌డం స‌రికాద‌ని శివసేన ఎంపీ సంజ‌య్ రౌత్ ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు.

ఒబామా వ్యాఖ్య‌ల‌పై దేశంలోని నాయ‌కులు అస‌హ్య‌క‌రంగా మాట్లాడార‌ని మండిప‌డ్డారు. ట్రంప్ పిచ్చిప‌ట్టిన‌ వ్య‌క్తిలా ప్ర‌వ‌ర్తిస్తున్నాడ‌ని మేమెప్పుడైనా అన్నామా అని ప్ర‌శ్నించారు. ఒబామాకు భారతదేశం గురించి ఎంత తెలుసు అని నిలదీశారు.



రాహుల్ గాంధీలో అభిరుచి, ఆస‌క్తి లోపించింద‌ని, హోంవ‌ర్క్ చేసిన విద్యార్థి ఎలా అయితే టీచ‌ర్‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తారో అలాగే రాహుల్ చేష్ట‌లు ఉన్న‌ట్లు అమెరికా మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒమాబా త‌న పుస్త‌కం ‘ఏ ప్రామిస్డ్‌ లాండ్‌’లో అభిప్రాయ‌ప‌డిన విషయం తెలిసిందే. రాహుల్ గాంధీకి తన గురించి తనకే తెలీదని.. అతనికి ఆ గుణం ఉందని ఒబామా పేర్కొన్నారు. ఈ పుస్త‌కం న‌వంబ‌ర్ 17న మార్కెట్‌ లో విడుదలకానుంది.



కాగా,గతంలో అనేక పుస్తకాలను రచించిన ఒబామా.. ఇప్పుడు తన కొత్త పుస్తకంలో రాహుల్ ప్రస్తావన తీయడం ఆసక్తిగా మారింది. ఎక్కడో అమెరికాలో ఉన్న ఒబామా.. మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురించి తాను ఏమనుకుంటున్నానో చెబుతానంటూ బుక్‌లో రాయడం చర్చనీయాంశంగా మారింది.

ట్రెండింగ్ వార్తలు