Rat Inside Bread : బాబోయ్.. బ్రెడ్ ప్యాకెట్‌లో ఎలుక, ఆన్‌లైన్ గ్రోసరీ సంస్థ నిర్వాకం

ఆన్ లైన్ లో గ్రోసరీ ఆర్డర్ చేసిన ఓ కస్టమర్ కు చేదు అనుభవం ఎదురైంది. అతడి ఇంటికి వచ్చిన బ్రెడ్ ప్యాకెట్‌లో బతికున్న ఎలుక క‌నిపించింది. దీంతో అతడికి దిమ్మతిరిగిపోయి మైండ్ బ్లాంక్ అయ్యింది.

Rat Inside Bread : ఇంట్లో నుంచి బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు. కాలు కదపాల్సిన పనీ లేదు. జస్ట్ ఫోన్ లో ఇలా ఆర్డర్ చేస్తే చాలు.. అలా కోరుకున్న వస్తువు, సరుకు, ఫుడ్ ఏదైనా సరే.. కళ్ల ముందు ఉంటుంది. ఇప్పుడంతా ఆన్ లైన్ బిజినెస్ హవా నడుస్తోంది. ఈ-కామర్స్ వెబ్ సైట్స్ కు తోడు అనేక రకాల గ్రోసరీ, ఫుడ్ డెలివరీ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు ఆర్డర్ చేసిన నిమిషాల వ్యవధిలోనే కొన్ని డోర్ డెలివరీ చేస్తున్నాయి. దీంతో పని చాలా సులువుగా మారింది.

అదే సమయంలో వీటి కారణంగా అప్పుడప్పుడు ఘోరమైన తప్పిదాలు జరుగుతున్నాయి. కస్టమర్లకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. డెలివ‌రీ యాప్స్‌ నిర్వాకంతో వ‌స్తువులు తారుమార‌వ‌డమే కాకుండా నాసిర‌కం వ‌స్తువులనూ డెలివ‌ర్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

Also Read..Flipkart Open Box Delivery : అరె.. ఏంట్రా ఇది.. ఫ్లిప్‌కార్ట్‌లో ల్యాప్‌టాప్ ఆర్డర్ చేస్తే.. సబ్బు వచ్చింది.. రీఫండ్ ఇదిగో నాయనా..!

అదే సమయంలో వేగంగా డెలివరీ చేయడం కోసమని అసలేం డెలివరీ చేస్తున్నామో? అందులో ఏమున్నాయి? అనేది కూడా చూసుకోలేని స్థితిలో ఆయా సంస్థల సిబ్బంది ఉండటం ఆందోళనకు గురి చేసే అంశం. తాజాగా ఆన్ లైన్ లో గ్రోసరీ ఆర్డర్ చేసిన ఓ కస్టమర్ కు చేదు అనుభవం ఎదురైంది. అతడి ఇంటికి వచ్చిన బ్రెడ్ ప్యాకెట్‌లో బతికున్న ఎలుక క‌నిపించింది. దీంతో అతడికి దిమ్మతిరిగిపోయి మైండ్ బ్లాంక్ అయ్యింది.

ఆయన పేరు నితిన్ అరోరా. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నాడు. గ్రోసరీ సేవలు అందించే బ్లింకిట్‌లో పలు వస్తువులను ఆర్డర్ చేశాడు. అందులో బ్రెడ్ ప్యాకెట్ కూడా ఒకటి. బ్లింకిట్ ఎగ్జిక్యూటివ్ వచ్చి వస్తువులను డెలివరీ చేసి వెళ్లిపోయాడు. నితిన్ అరోరా వాటిని తెరిచి చూడగా కళ్లు బైర్లు కమ్మాయి. బ్రెడ్ ప్యాకెట్ లో బతికున్న ఎలుక కనిపించింది. బ్రెడ్ ప్యాకెట్ లోకి దూరిన ఎలుక అక్కడి నుంచి బయటకు రాలేక అలాగే ఉండిపోయింది.

Also Read..Fake OTP Delivery Scam : ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నారా? ఇదో కొత్త ఫేక్ OTP డెలివరీ స్కామ్‌.. మీ ఇంటికే వచ్చి డబ్బులు దోచేస్తారు జాగ్రత్త..!

దీని గురించి నితిన్ అరోరా సోషల్ మీడియాలో తెలియజేశాడు. తనకు ఎంతో అసౌకర్యమైన అనుభవం ఎదురైనట్టు ట్విట్టర్ లో వాపోయాడు. ఇది మనకు హెచ్చరిక వంటిదని రాసుకొచ్చాడు. 10 నిమిషాల డెలివరీలో అలాంటివి ఉండేటట్టు అయితే, సరైన డెలివరీ కోసం నేను గంటల కొద్దీ వేచి చూడడానికి వెనుకాడను అంటూ నితిన్ ట్వీట్ చేశారు.

దీనికి బ్లింకిట్ టీమ్ వెంటనే స్పందించింది. మీకు ఇలాంటి అసౌక‌ర్యం క‌లగాల‌ని మేము కోరుకోలేదు, మీ కాంటాక్ట్ నెంబ‌ర్ లేదా ఆర్డ‌ర్ ఐడీ పంపితే స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని బ‌దులిచ్చింది. అంతేకాదు కఠిన చర్య తీసుకున్నామని, పార్ట్ నర్ ను తమ ప్లాట్ ఫామ్ నుంచి తొలగించామని బ్లింకిట్ కస్టమర్ సపోర్ట్ హెడ్ వెల్ల‌డించాడు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

కాగా, ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లను షాక్ కి గురి చేస్తోంది. బ్రెడ్ ప్యాకెట్ లో ఎలుక.. చాలా దారుణం అంటున్నారు. సదరు గ్రోసరీ సంస్థ సిబ్బంది నిర్లక్ష్యంపై ఫైర్ అవుతున్నారు. ఇది క్షమించరాని నేరం అంటున్నారు. ఆలస్యం అయినా ఫర్వాలేదు కానీ, సురక్షితమైన ఫుడ్ డెలివరీ చేయాలంటూ గ్రోసరీ సంస్థలకు సూచిస్తున్నారు.