Flipkart Open Box Delivery : అరె.. ఏంట్రా ఇది.. ఫ్లిప్‌కార్ట్‌లో ల్యాప్‌టాప్ ఆర్డర్ చేస్తే.. సబ్బు వచ్చింది.. రీఫండ్ ఇదిగో నాయనా..!

Flipkart Wrong Order : ఆన్‌లైన్‌లో ఒకదాన్ని ఆర్డర్ చేస్తే మరొకటి డెలివరీ కావడం చాలా కామన్. ఇలాంటివి ఇదేం మొదటిసారి కాదు. చాలా సందర్భాల్లో కస్టమర్లు ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్నారు. తాజాగా ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ ఫెస్టివల్ సేల్ ఉంది కదా అని.. మంచి ల్యాప్‌టాప్ కోసం ఆర్డర్ చేశాడు..

Flipkart Open Box Delivery : అరె.. ఏంట్రా ఇది.. ఫ్లిప్‌కార్ట్‌లో ల్యాప్‌టాప్ ఆర్డర్ చేస్తే.. సబ్బు వచ్చింది.. రీఫండ్ ఇదిగో నాయనా..!

Student orders laptop from Flipkart but gets soap delivered, company responds

Flipkart Open Box Delivery : ఆన్‌లైన్‌లో ఒకదాన్ని ఆర్డర్ చేస్తే మరొకటి డెలివరీ కావడం చాలా కామన్. ఇలాంటివి ఇదేం మొదటిసారి కాదు. చాలా సందర్భాల్లో కస్టమర్లు ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్నారు. తాజాగా ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ ఫెస్టివల్ సేల్ ఉంది కదా అని.. మంచి ల్యాప్‌టాప్ కోసం ఆర్డర్ చేశాడు.. కానీ, అతడు ఆర్డర్ చేసిన ల్యాప్‌టాప్ రాలేదు. దానికి బదులుగా ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ డిటర్జెంట్ సబ్బును డెలివరీ చేశాడు. అంతే.. ఆ డెలివరీ ఓపెన్ చేసిన కస్టమర్ కంగుతిన్నాడు. ల్యాప్‌టాప్ ఆర్డర్ చేస్తే సబ్బు ఎలా వచ్చిందో తెలియక అర్థం కాలేదు.

వెంటనే ఈ విషయంపై ఫ్లిప్‌కార్ట్‌కు ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన ఫ్లిప్‌కార్ట్ వెంటనే అధికారిక ప్రకటన జారీ చేసింది. అంతేకాదు… జరిగిన తప్పిదానికి చింతిస్తూ.. కంపెనీ కస్టమర్‌కు రీఫండ్ జారీ చేసినట్లు తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌ (Flipkart Big Billion Days Sale)లో IIM అహ్మదాబాద్ విద్యార్థి యశస్వి శర్మ తన తండ్రికి ల్యాప్‌టాప్ ఆర్డర్ చేశాడు.

కానీ, ప్యాకేజీ డెలివరీ అయినప్పుడు.. ల్యాప్‌టాప్‌కు బదులుగా డిటర్జెంట్ బార్ సబ్బును అందుకున్నాడు. డెలివరీ స్కామ్ జరిగిందంటూ శర్మ సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదు చేశాడు. కొద్దిసేపటికే, ఫ్లిప్‌కార్ట్ స్పందించి క్షమాపణలు తెలియజేసింది. జరిగిన తప్పిదానికిగానూ ఆర్డర్‌పై బాధితుడికి రీఫండ్ జారీ చేసింది.

Student orders laptop from Flipkart but gets soap delivered, company responds

Student orders laptop from Flipkart but gets soap delivered, company responds

ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ విశ్వాసాన్ని పెంచుకునేందుకు ఇలాంటి సంఘటనలపై జీరో-టాలరెన్స్ విధానాన్ని పాటిస్తుంది. తమ కస్టమర్‌లకు సాధ్యమైనంత వరకు బెస్ట్ ఆన్‌లైన్ షాపింగ్ ఎక్స్ పీరియన్స్ అందించడమే లక్ష్యమని చెబుతోంది. దీనిపై ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధి మాట్లాడుతూ.. ఓపెన్ బాక్స్ డెలివరీ ఆప్షన్ అందించిన సందర్భంలో కస్టమర్ ప్యాకేజీని తెరవకుండానే డెలివరీ ఎగ్జిక్యూటివ్‌తో OTPని షేర్ చేసుకున్నారు. ఆ వివరాలు ధృవీకరించిన తర్వాత.. కస్టమర్ సర్వీసు టీం రీఫండ్ ప్రాసెస్ ప్రారంభించింది. అది 3-4 పని దినాలలో కస్టమర్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. తప్పుగా డెలివరీ చేసిన తమ ఏజెంట్ పై చర్యలు తీసుకుంటున్నట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.

ఓపెన్ బాక్స్ డెలివరీ (Open Box Delivery) అంటే ఏమిటి? :
అర్థమయ్యేలా చెప్పాలంటే.. ఫ్లిప్‌కార్ట్ కస్టమర్‌లకు ఓపెన్ బాక్స్ ఆప్షన్ అందిస్తుంది. డెలివరీ సమయంలో కస్టమర్ ఆ డెలివరీ బాక్స్‌ను ఓపెన్ చేయవచ్చు. ఓపెన్ బాక్స్ డెలివరీ విధానాన్నికంపెనీ ప్రతినిధి మాట్లాడారు. ఫ్లిప్‌కార్ట్ ఓపెన్ బాక్స్ డెలివరీ అనేది కస్టమర్ ప్రయోజనాలను కాపాడేందుకు తీసుకొచ్చినట్టు తెలిపారు. ఓపెన్ బాక్స్ డెలివరీ ప్రక్రియలో భాగంగా Flipkart Wishmasters (డెలివరీ పార్టనర్) డెలివరీ సమయంలో, కస్టమర్ ముందు ప్రొడక్టును ఓపెన్ చేస్తుంది. తద్వారా కస్టమర్‌లు తమ ఆర్డర్‌లు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవచ్చు.

ఆ తర్వాతే డెలివరీని అంగీకరించి.. ఆపై OTPని షేర్ చేయాల్సి ఉంటుంది. దాంతో కస్టమర్ కూడా ఆర్డర్ చేసిన ప్రొడక్టును అందుకోవచ్చు. అందుకే ఇకపై ఫ్లిప్‌కార్ట్‌లో ఎవరైనా ఏదైనా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసినప్పుడు ఓపెన్ బాక్స్ డెలివరీ ఎంపిక (Open Box Delivery Option)ను ఎంచుకున్నారో లేదో చెక్ చేసుకోండి.. మీరు ఖరీదైన ఆర్డర్ సమయంలో అంటే.. ఎలక్ట్రానిక్ ప్రొడక్టు లేదా ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను ఆర్డర్ చేసినప్పుడు ఈ ఆప్షన్ తప్పక ఎంచుకోవడం మరిచిపోవద్దు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Flipkart Responds: ఐఫోన్‌ 13 ఆర్డర్లు క్యాన్సిల్.. కస్టమర్ల ఆగ్రహం.. ఫ్లిప్‌కార్ట్‌ ఏం చెప్పిందంటే