Kerala Road Accident : రోడ్డు దాటుతున్నారా? బీకేర్ ఫుల్.. రెప్పపాటులో ఘోరం జరిగిపోయింది.. ఒళ్లుగగుర్పొడిచే యాక్సిడెంట్ వీడియో

రోడ్డు క్రాస్ చేసే సమయంలో మరింత అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోవచ్చు. Kerala Road Accident

Kerala Road Accident(Photo : Google)

Kerala Shocking Accident : రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోయింది. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. రహదారులు రక్తసిక్తం అవుతున్నాయి. అయితే చాలావరకు యాక్సిడెంట్లకు.. వాహనదారుల నిర్లక్ష్యం, ర్యాష్ డ్రైవింగ్, అతి వేగం కారణం అవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఎలాంటి తప్పు చేయకపోయినా బలైపోతున్నారు. రోడ్డు ప్రమాదాలు(Road Accidents) ఎంత దారుణంగా ఉంటున్నాయంటే.. స్పాట్ లోనే ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అంతే, ప్రమాదల తీవ్రత ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇక, రోడ్డు మీద వెళ్లే సమయంలో వాహనదారులు కావొచ్చు, నడుచుకుంటూ వెళ్లే వారు కావొచ్చు.. కచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే రెప్పపాటులో ఘోరం జరిగిపోవచ్చు. ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోవచ్చు. ముఖ్యంగా రోడ్డు క్రాస్ చేసే సమయంలో మరింత అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా చెప్పేందుకు కేరళలో(Kerala) జరిగిన ఓ దారుణమైన యాక్సిడెంటే కారణం.

Also Read..Karnataka : గాల్లోకి ఎగిరిన బైక్.. విద్యార్ధినులను ఢీకొట్టిన కారు.. వైరల్ అవుతున్న కర్ణాటక రోడ్డు ప్రమాద ఘటన

కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంగా దూసుకొచ్చిన బైక్.. రోడ్డు క్రాస్ చేస్తున్న విద్యార్థినులను బలంగా ఢీకొట్టింది. అంతే, స్పాట్ లోనే ఒక అమ్మాయి చనిపోయింది. మరో అమ్మాయి తీవ్రంగా గాయపడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కేరళలోని మువట్టుపుజాలోని నిర్మల కాలేజీ విద్యార్థినులు ఇద్దరు రోడ్డు దాటుతున్నారు. ఇంతలో వేగంగా దూసుకొచ్చిన బైక్(Bike) వారిని బలంగా ఢీకొట్టింది. ఒక అమ్మాయి గాల్లో ఎగిరి పడింది. మరో అమ్మాయిని బైక్ కొంతదూరం ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలతో ఒక అమ్మాయి స్పాట్ లోనే మరణించింది. మరో అమ్మాయి తీవ్రంగా గాయపడింది. మృతురాలిని నమితగా గుర్తించారు. ఈ యాక్సిడెంట్ ను కళ్లారా చూసిన స్థానికులు షాక్ కి గురయ్యారు. భయంతో వణికిపోయారు. యాక్సిడెంట్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మరో అమ్మాయి అనుశ్రీ రాజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇక బైక్ నడిపిన అబ్బాయి అన్సన్ రాయ్(22) కూడా ఈ ఘటనలో గాయాలపాలయ్యాడు. కాలేజీ అయిపోవడంతో ఇద్దరు అమ్మాయిలు బయటకు వచ్చారు. రోడ్డు క్రాస్ చేసే పనిలో ఉన్నారు. కొన్ని కార్లు రోడ్డు మీద వెళ్లాయి. దాంతో రోడ్డు క్లియర్ కావడంతో ఆ ఇద్దరు అమ్మాయిలు ముందుకు నడిచారు. సగం రోడ్డులోకి వెళ్లాక ఘోరం జరిగిపోయింది. వేగంగా దూసుకొచ్చిన బైక్ ఇద్దరమ్మాయిలను గుద్ది పడేసింది. ఒక అమ్మాయి గాల్లో ఎగిరి రోడ్డు మీద పడింది. మరో అమ్మాయిని బైక్ ఈడ్చుకెళ్లింది.

Also Read..500 Rupee Note : ఇలాంటి 500 రూపాయల నోట్లు ఫేక్..? ఇవి చెల్లవు? క్లారిటీ ఇచ్చిన కేంద్రం, అసలు నిజం ఇదే..

పాపం ఆ అమ్మాయిలు.. రోడ్డు దాటే(Road Crossing) సమయంలో ఎంతో జాగ్రత్త తీసుకున్నారు. రోడ్డు పై ఇక వాహనాలు ఏవీ రావడం లేదని నిర్ధారించుకున్నాకే ముందుకు కదిలారు. కానీ, వేగంగా దూసుకొచ్చిన బైక్ తమ పాలిట మృత్యువు అవుతుందని ఊహించలేకపోయారు.

రోడ్డు దాటే సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని ఈ ప్రమాదం చెబుతుంది. అంతేకాదు అతి వేగం ప్రాణాంతకం అని మరోసారి రుజువైంది. బైకర్ చాలా వేగంగా రావడం ఘోర ప్రమాదానికి దారితీసింది. ఒక నిండు ప్రాణం పోవడానికి కారణమైంది.

ట్రెండింగ్ వార్తలు