500 Rupee Note : ఇలాంటి 500 రూపాయల నోట్లు ఫేక్..? ఇవి చెల్లవు? క్లారిటీ ఇచ్చిన కేంద్రం, అసలు నిజం ఇదే..

అలా స్టార్ (asterisk) గుర్తు ఉన్న కరెన్సీ నోట్లు ఫేక్ అని, అలాంటి నోట్లు ఎవరూ కూడా తీసుకోవద్దని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 500 Rupee Note

500 Rupee Note : ఇలాంటి 500 రూపాయల నోట్లు ఫేక్..? ఇవి చెల్లవు?  క్లారిటీ ఇచ్చిన కేంద్రం, అసలు నిజం ఇదే..

500 Rupee Note - Fact Check(Photo : Google)

500 Rupee Note – Fact Check : సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో ఫేక్ న్యూస్ లు ఎక్కువైపోయాయి. వాయు వేగంతో తప్పుడు వార్తలు సర్కులేట్ అయిపోతున్నాయి. అది నిజమో కాదో తెలుసుకోకుండానే.. జనాలు వాటిని షేర్ చేస్తున్నారు, ఫార్వర్డ్ చేసేస్తున్నారు. దాంతో ప్రజల్లో గందరగోళం పెరిగిపోయింది. ఏది నిజం? ఏది అబద్దం? తెలుసుకోవడం కష్టంగా మారింది. ఇలాంటి ఫేక్ న్యూస్ లు ఇటీవల చాలానే సోషల్ మీడియాలో (Social Media) దర్శనం ఇచ్చాయి. ఆ తర్వాత అందులో నిజం లేదని తెలిసింది. తాజాగా అలాంటి ఫేక్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

500 Rupee Note

500 Rupee Note(Photo : Google)

విషయం ఏంటంటే.. చెలామణిలో ఉన్న 500 రూపాయల నోట్లు(500 Rupee Note) ఫేక్ అనే వార్త జోరుగా ప్రచారం అవుతోంది. అలా చెప్పడానికి కారణం లేకపోలేదు. ఆ 500 రూపాయల నోట్లలో కింది భాగాన సీరియల్ నెంబర్ మధ్యలో స్టార్ గుర్తు(Star Symbol) ఉంటుంది. అలా స్టార్ (asterisk) గుర్తు ఉన్న కరెన్సీ నోట్లు ఫేక్ అని, అలాంటి నోట్లు ఎవరూ కూడా తీసుకోవద్దని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఇది నిజమే అని నమ్మేసి ఆందోళనకు గురవుతున్నారు. ఈ వార్త వైరల్ కావడంతో పాటు కేంద్రం దృష్టికి వెళ్లింది.

Also Read..Karnataka : గాల్లోకి ఎగిరిన బైక్.. విద్యార్ధినులను ఢీకొట్టిన కారు.. వైరల్ అవుతున్న కర్ణాటక రోడ్డు ప్రమాద ఘటన

దాంతో వెంటనే కేంద్రానికి చెందిన PIB ఫ్యాక్ట్ చెక్(PIB Fact Check) సంస్థ స్పందించింది. సీరియల్ నెంబర్ మధ్యలో స్టార్ గుర్తు ఉన్న 500 రూపాయల నోట్లు ఫేక్ అనే వార్తలో నిజం లేదని తేల్చి చెప్పింది. ఆ వార్త పూర్తిగా అబద్దం అని స్పష్టం చేసింది. అంతేకాదు.. 2016లో రూ.500, రూ.1000 నోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ కొత్తగా విడుదల చేసిన రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.500 నోట్లలో స్టార్ గుర్తు ఉంటుందని చెప్పింది. ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంది. అలాగే, సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తుంటాయని, అందులో కొన్ని తప్పుడు వార్తలు, తప్పుడు సమాచారం ఉంటుందని, అలాంటివి నమ్మొద్దని కేంద్ర సంస్థ ప్రజలకు సూచించింది.

Also Read..Orange popsicles : ఆరంజ్ ఐస్ ఫ్రూట్స్ ఇష్టమా? ఫ్యాక్టరీలో తయారయ్యే విధానం చూస్తే వాటి జోలికి వెళ్లరు

500 రూపాయల నోటు కింది భాగంలో నెంబర్ ప్యానెల్‌లో నక్షత్రం(star) గుర్తు ఉన్న నోట్లు చెల్లుబాటు అవుతాయని, ఆ కరెన్సీ నోట్లు చట్టబద్ధమైనవని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI ) తెలిపింది. ఈ మేరకు ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.

“నంబర్ ప్యానెల్‌లో నక్షత్రం (*) గుర్తు ఉన్న బ్యాంకు నోట్ల చెల్లుబాటుపై ఇటీవల కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో చర్చలు జరుగుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ దృష్టికి వచ్చింది. నక్షత్రం (*) చిహ్నాన్ని బ్యాంక్ నోట్ నంబర్ ప్యానెల్‌లో చొప్పించారు. ఇది 100 ముక్కల సీరియల్ నంబర్ ఉన్న బ్యాంక్ నోట్ల ప్యాకెట్‌లో లోపభూయిష్టంగా ముద్రించిన బ్యాంక్ నోట్లకు బదులుగా ఉపయోగించబడుతుంది. లోపభూయిష్టంగా ముద్రించిన నోట్లకు ప్రత్యామ్నాయంగా RBI 2006లో స్టార్ సిరీస్ నోట్లను ప్రవేశపెట్టింది. రూ.10, రూ.20, రూ.50 వంటి డినామినేషన్‌లు ఇప్పటికే స్టార్ సిరీస్ నోట్లను కలిగి ఉన్నాయి.

క్రమ సంఖ్యల ప్యాకెట్‌లో, ప్రింటింగ్ దశలో గుర్తించిన ఏదైనా లోపం ఉన్న నోట్లను నోట్ ప్రింటింగ్ ప్రెస్‌ల వద్ద అదే నంబర్ కలిగిన నోట్లతో భర్తీ చేస్తారు. తద్వారా ప్యాకెట్ క్రమం నిర్వహించబడుతుంది. స్టార్ సిరీస్ నోట్లు చట్టబద్ధంగా ఉంటాయి. ఈ నోట్లను స్వేచ్ఛగా అంగీకరించవచ్చు, ఉపయోగించవచ్చు. సెంట్రల్ బ్యాంక్ డిసెంబర్ 2016లో కొత్త 500 రూపాయల నోట్లలో స్టార్ సిరీస్‌ని విడుదల చేసింది” అని ఆర్బీఐ తెలిపింది.