Orange popsicles : ఆరంజ్ ఐస్ ఫ్రూట్స్ ఇష్టమా? ఫ్యాక్టరీలో తయారయ్యే విధానం చూస్తే వాటి జోలికి వెళ్లరు
పిల్లలు, పెద్దలు ఐస్ క్రీమ్స్, ఐస్ ఫ్రూట్స్ అంటే ఎంతో ఇష్టపడతారు. అయితే రీసెంట్‌గా ఓ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్న ఆరంజ్ ఐస్ ఫ్రూట్స్ వీడియో వైరల్ అవుతోంది. ఎలాంటి భద్రత తీసుకోకుండా కార్మికులు తయారు చేస్తున్నవిధానం జనాలకు కోపం తెప్పించింది.

Orange popsicles
Orange popsicles : వేసవికాలం వచ్చిందంటే ఐస్ ఫ్రూట్స్, ఐస్ క్రీమ్స్‌కి డిమాండ్ ఉంటుంది. సాధారణ రోజుల్లో కూడా పిల్లలు రంగుల్లో దొరికే ఐస్ ఫ్రూట్స్ చాలా ఇష్టపడతారు. అయితే సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఫ్యాక్టరీల్లో తయారు చేస్తున్న ఐస్ ఫ్రూట్స్ వీడియో చూస్తే వాటిని తినడానికి భయపడతారు.
Bengaluru : అక్కడ ఐస్ క్రీం స్కూప్‌లు ఫ్రీగా ఇచ్చారు.. కానీ.. ఓ షరతు పెట్టారు
foodie_incarnate అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన వీడియో జనాలకు కోపం తెప్పించింది. ఆరంజ్ ఐస్ ఫ్రూట్స్ తయారు చేసే ఫ్యాక్టరీలో తీసిన వీడియో వైరల్ అవుతోంది. అనేక రుచులు అందుబాటులో ఉన్నా నారింజ అంటే జనం చాలా ఇష్టపడతారు. వీడియో క్లిప్‌లో ఆరంజ్ కలర్ ఎసెన్, చక్కెర, నీరు కలిపిన మిశ్రమాన్ని తయారు చేయడానికి జోడించారు. ఇక వీటిని తయారు చేస్తున్న కార్మికులు చేతులకి గ్లౌజులు కూడా ధరించలేదు. ఈ వీడియోను షేర్ చేసిన కొద్దిసేపటికే వైరల్‌గా మారింది. నెటిజన్లు ఈ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Tomato ice cream : ‘టొమాటో ఐస్ క్రీం’ కొత్త ఫుడ్ కాంబినేషన్ .. ‘రిప్ టొమాటో’ అంటున్న నెటిజన్లు
‘దీనిని ఇకపై తినలేను.. తినమని ఎవరికీ చెప్పను’ అని.. ‘ప్రభుత్వం ఇలాంటి ఫ్యాక్టరీలు నడపడానికి ఎలా అనుమతిస్తోంది? దీనిని చూపించినందుకు ధన్యవాదాలు’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. ఇక ఆరంజ్ ఐస్ ఫ్రూట్ తినాలి అనుకునేవారు కాస్త ఆలోచించి తినాలి మరి.
View this post on Instagram