Shubhanshu Shukla Modi
Shubhanshu Shukla: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని యాక్సియం 4 స్పేస్ మిషన్ పైలట్, వైమానిక దళ పైలట్ శుభాంశు శుక్లా కలిశారు.
ఢిల్లీలోని ప్రధాని అధికారిక నివాసానికి శుక్లా వెళ్లారు. తన చరిత్రాత్మక Ax-4 మిషన్ సమయంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు తీసుకెళ్లిన భారత జాతీయ పతాకాన్ని ప్రధానికి శుక్లా అందజేశారు.
శుక్లా(Shubhanshu Shukla)ను మోదీ అభినందించారు. ఐఎస్‌ఎస్‌కు వెళ్లి వచ్చిన క్రమంలో ఎదురైన అనుభవాలను, సవాళ్లను మోదీకి శుక్లా వివరించారు. ఐఎస్‌ఎస్‌లో శుక్లా పరిశోధనలు చేసిన విషయం తెలిసిందే.
మైక్రోగ్రావిటీలో హ్యూమన్ ఫిజియాలజీ అధ్యయనం నుంచి స్పేస్ వ్యవసాయ సాంకేతికతల వరకు చేసిన శాస్త్రీయ పరిశోధనలు భారత గగనయాన్ మానవ అంతరిక్ష ప్రాజెక్టుకు నేరుగా ఉపయోగపడతాయి.
Also Read: AP Weather Update: ఏపీలో వాయుగుండం ఎఫెక్ట్.. వాతావరణ శాఖ హెచ్చరికలు.. ఈ జిల్లాలు బీ కేర్ ఫుల్
మరోవైపు, సోమవారం పార్లమెంట్లో గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా చరిత్రాత్మక Ax-4 మిషన్ గురించి సభ్యులు మాట్లాడారు.
కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఈ ప్రత్యేక సభను నడిపి, శుక్లా విజయాలను ప్రశంసించారు.
ఇవి భారత అంతరిక్ష ఆకాంక్షలకు కొత్త శక్తినిచ్చాయని తెలిపారు. విపక్షం చర్చలో పాల్గొనకపోయినా, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఎక్స్‌లో శుక్లా గురించి స్పందించారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టిన మొట్టమొదటి భారతీయుడిగా శుభాంశు శుక్లా చరిత్ర సృష్టించారు. 1984లో భారతీయుడు రాకేశ్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లారు. దాదాపు 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ శుభాంశు శుక్లా ప్రతిష్ఠాత్మక యాక్సియమ్-4 మిషన్‌లో భాగంగా ఐఎస్ఎస్ వెళ్లారు. భారతీయుడు ఐఎస్‌ఎస్‌కు వెళ్లడం మాత్రం ఇదే తొలిసారి.
#WATCH | Group Captain Shubhanshu Shukla, who was the pilot of Axiom-4 Space Mission to the International Space Station (ISS), meets Prime Minister Narendra Modi. pic.twitter.com/0uvclu9V2b
— ANI (@ANI) August 18, 2025