Karnataka: ఆర్‌ఎస్‌ఎస్‌కు షాకిచ్చిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.. బొమ్మై హామీ వెనక్కే

ఎన్నికలకు ఆరు నెలల ముందు బీజేపీ ప్రభుత్వంలో కేటాయించిన అన్ని భూముల విధానాలను రద్దు చేస్తామని మంత్రులు పలుమార్లు ప్రకటించారు. అందుకు అనుగుణంగా తొలి షాక్‌ ఇచ్చేలా 35.33 ఎకరాల భూమిని అప్పగించేందుకు అభ్యంతరం తెలిపింది

RSS and Siddaramaiah: రాష్ట్రీయ స్వయం సేవక్‌(ఆర్‌ఎస్‌ఎస్‌)కు ముఖ్యమంత్రి సిద్దరామయ్య షాక్‌ ఇచ్చారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు అనుబంధమైన జనసేవా ట్రస్టుకు అప్పటి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని బొమ్మై ప్రభుత్వం కేటాయించిన భూమిని వెనక్కి తీసుకుంది. వాస్తవానికి భూమి ఇస్తామని అప్పట్లో బీజేపీ ప్రభుత్వం హామీ ఇచ్చి, కొంత ప్రాసెస్ చేసింది. అయితే తాజాగా భూమి ఇవ్వమని కాంగ్రెస్ ప్రభుత్వం తేల్చి చెప్పింది.

Pawan Kalyan first Instagram post : ఇన్‌స్టాగ్రామ్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ మొద‌టి పోస్ట్‌.. ఎప్ప‌టికీ గుర్తుండిపోయే జ్ఞాప‌కాలు..

ఆర్‌ఎస్‌ఎస్‌కు అనుబంధమైన జనసేవా ట్రస్టుకు బెంగళూరు దక్షిణ తాలూకా కురుబరహళ్ళి పంచాయతీ తావరెకెరె పరిధిలో 35.33 ఎకరాల గోమాళ భూమిని బొమ్మై ప్రభుత్వం కేటాయించింది. 2023 మే 22న జిల్లాధికారి గోమాళ భూమిని జనసేవా ట్రస్టుకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇకపోతే, ప్రస్తుతం భూమిని అప్పగించేందుకు తగిన అనుమతులను జారీ చేయాల్సి ఉంది. కానీ, ప్రభుత్వ సూచనల మేరకు సదరు భూమిని జనసేవా ట్రస్టుకు అప్పగించేందుకు అభ్యంతరం తెలిపింది.

Producer Dil Raju : హైద‌రాబాద్‌లో ఫాంటమ్ డిజిటల్ ఎఫెక్ట్స్ లిమిటెడ్ స్టూడియోను ప్రారంభించిన దిల్ రాజు

ఎన్నికలకు ఆరు నెలల ముందు బీజేపీ ప్రభుత్వంలో కేటాయించిన అన్ని భూముల విధానాలను రద్దు చేస్తామని మంత్రులు పలుమార్లు ప్రకటించారు. అందుకు అనుగుణంగా తొలి షాక్‌ ఇచ్చేలా 35.33 ఎకరాల భూమిని అప్పగించేందుకు అభ్యంతరం తెలిపింది. దీనితో పాటు బొమ్మై ప్రభుత్వంలోని హామీలన్నీ తిగరతోడే అవకాశం ఉందని అంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు