Producer Dil Raju : హైద‌రాబాద్‌లో ఫాంటమ్ డిజిటల్ ఎఫెక్ట్స్ లిమిటెడ్ స్టూడియోను ప్రారంభించిన దిల్ రాజు

భారతదేశంలోని ప్రముఖ విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియోలలో ఒకటైన ఫాంటమ్ డిజిటల్ ఎఫెక్ట్స్ లిమిటెడ్, కంపెనీ తన స్టూడియోను హైదరాబాద్ లో స్టార్ట్ చేసింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ స్టూడియో ప్రారంభించారు.

Producer Dil Raju : హైద‌రాబాద్‌లో ఫాంటమ్ డిజిటల్ ఎఫెక్ట్స్ లిమిటెడ్ స్టూడియోను ప్రారంభించిన దిల్ రాజు

Dil Raju Launches Phantom FX Office

Dil Raju Launches Phantom FX Office : భారతదేశంలోని ప్రముఖ విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియోలలో ఒకటైన ఫాంటమ్ డిజిటల్ ఎఫెక్ట్స్ లిమిటెడ్, కంపెనీ తన స్టూడియోను హైదరాబాద్ లో స్టార్ట్ చేసింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ స్టూడియోను ప్రారంభించారు.

దశాబ్ద కాలంగా Phantom FX తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ బహుళ భాషలలో చలనచిత్రాలు, టీవీ, వాణిజ్య ప్రకటనల కోసం సృజనాత్మక VFX సేవలను అందిస్తుంది. దేశీయ, అంతర్జాతీయ ప్రాజెక్ట్‌లలో అధిక-నాణ్యత VFXని అందించడంలో ఫాంటమ్ కంపెనీ బలమైన ఖ్యాతిని కలిగి ఉంది.

దిల్ రాజు మాట్లాడుతూ.. సినిమాల్లో మంచి వీఎఫ్‌ఎక్స్ క్వాలిటీగా ఉంటేనే ప్రేక్షకులు థ్రిల్‌ను అనుభవిస్తారు. ఫాంటమ్ లో మంచి టాలెంటెడ్ నిపుణులు ఉన్నారు. నిర్మాతలందరూ ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోవాలని కోరుకుంటూ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు.

Pawan Kalyan first Instagram post : ఇన్‌స్టాగ్రామ్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ మొద‌టి పోస్ట్‌.. ఎప్ప‌టికీ గుర్తుండిపోయే జ్ఞాప‌కాలు..

హైదరాబాద్ స్టూడియో బిజినెస్ హెడ్ సునీల్ ఆకుల మాట్లాడుతూ.. ఇరవై ఏళ్ల నుండి విజువల్ ఎఫెక్ట్స్ రంగంలో ఉన్నాను. తెలుగు చిత్ర పరిశ్రమలోని నిర్మాతలు, దర్శకులందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో హైదరాబాద్ లో ఫాంటమ్ యఫ్ఎక్స్ బ్రాంచ్ స్టార్ట్ చేయటం జరిగింది. పిలవగానే వచ్చి మా ఫాంటమ్ బ్రాంచ్ ఆఫీస్ ను ప్రారంభించిన దిల్ రాజు కి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

ఫాంటమ్‌ఎఫ్‌ఎక్స్ CEO, వ్యవస్థాపకుడు, బెజాయ్ అర్పుతరాజ్ మాట్లాడుతూ.. నాణ్యమైన VFXని అందించడమే మా ఫాంటమ్ స్టూడియో యొక్క మొదటి ప్రాధాన్యత అని అన్నారు. చెన్నై, ముంబై, హైదరాబాద్‌లలో అత్యాధునిక స్టూడియోలతో, ఫాంటమ్‌ ఎఫ్‌ఎక్స్ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో గుర్తింపు పొందుతోంద‌ని, ప్రపంచవ్యాప్తంగా భారతీయ విజువల్ ఎఫెక్ట్‌ల కోసం బార్‌ను పెంచుతోందన్నారు.

Sitara : సితార పాప జ్యువెల్లరీ యాడ్ కోసం తీసుకున్న‌ రెమ్యునరేషన్‌తో ఏం చేసిందో తెలుసా..?

ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత టాగూర్ మధు, హోమ్ బలే సంస్థ ప్రతినిధి కైకాల రామారావు, హర్షిత్ రెడ్డి, దర్శకులు అశ్విన్ గంగరాజు, భరత్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.