Karnataka CM Swearing: కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు పూర్తి.. ఎవరెవరు హాజరువుతున్నారంటే?

కేరళ సీఎం, సీపీఐ(ఎం) నేత పినరయి విజయన్‌ను ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంకు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించకపోవటం‌పై ఆ రాష్ట్రంలోని ప్రజాస్వామ్య కూటమి విమర్శలు సంధించింది.

Karnataka CM Swearing

Karnataka CM: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య (Siddaramaiah) మరికొద్ది సేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ (DK Shivakumar), మంత్రులుగా మరో ఎనిమిది మంది ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా సిద్ధ రామయ్య, శివకుమార్ లతో పాటు సహచరులను గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఆహ్వానించారు. కంఠీరవ స్టేడియంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరుగనుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Karnataka CM: 2018 సీన్ మళ్లీ కనపడుతుందా? ప్రమాణ స్వీకారోత్సవానికి కంఠీరవ స్టేడియం సిద్ధం.. ప్రత్యేకతలేంటీ?

ఈ ప్రమాణ స్వీకారోత్సవం ద్వారా విపక్షాల ఐక్యతను చాటాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. బీజేపీయేతర పార్టీల్లోన్ని కొన్ని పార్టీలకు మాత్రమే సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని ఆహ్వానాలు అందాయి. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే పలువురు ముఖ్యమంత్రులు, నేతలను ఫోన్ ద్వారా ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించారు. వీరిలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీహార్ సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లాలకు ఖర్గే ఆహ్వానాలు పంపించారు.

Karnataka Elections Result: రాహుల్ గాంధీ ‘జోడో యాత్ర ’ సాగిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎన్నిచోట్ల గెలిచిందో తెలుసా?

సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ లకు కూడా ఫోన్ ద్వారా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానాలు అందాయి. అయితే.. పశ్చిమ బెంగాళ్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదు. ఆమె ప్రతినిధిగా టీఎంసీ ఎంపీ కకోలి ఘోష్ దస్తీదార్ హాజరవుతారని ఆ పార్టీ ఎంపీ దెరెక్ ఓబ్రెయిన్ తెలిపారు. అఖిలేష్ యాదవ్ కూడా హాజరు కావడం లేదని సమాచారం. అయితే, కాంగ్రెస్ పార్టీ ఆహ్వానాలు అందించిన వారిలో కేరళ సీఎం, సీపీఐ(ఎం) నేత పినరయి విజయన్ ను ఆహ్వానించకపోవటం పై ఆ రాష్ట్రంలోని ప్రజాస్వామ్య కూటమి విమర్శలు సంధించింది.

Karnataka: సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం.. కేసీఆర్ సహా ఈ నేతలు మాత్రం…

కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా, పలువురు కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రులు, పార్టీ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు కూడా సిద్ధ రామయ్య ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గోనున్నారు.

Karnataka Cabinet: సిద్ధరామయ్య కేబినెట్‌లో తొలుత ప్రమాణ స్వీకారం చేసే పది మంది మంత్రులు వీరే..

ఇదిలాఉంటే బీజేపీయేతర పాలిత రాష్ట్రాల సీఎంలలో కొందరిని కాంగ్రెస్ ఆహ్వానించలేదు. వీరిలో.. తెలంగాణ సీఎం కేసీఆర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేరళ సీఎం పినరయి విజయన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సీఎం కేసీఆర్ పార్టీతో ఢీకొంటుంది. ఢిల్లీ, పంజాబ్, ఒడిశా రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి. మొదటి నుంచి ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి దూరంగానే ఉన్నారు. బీజేపీకి అనుకూలంగా వైసీపీ పార్టీ ఉంది. ఈ క్రమంలో జగన్ కు సైతం ఆహ్వానం అందలేదు. ఇలా ఆయా రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితిని బట్టి కాంగ్రెస్ కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానాలను పంపింది.