Karnataka CM: 2018 సీన్ మళ్లీ కనపడుతుందా? ప్రమాణ స్వీకారోత్సవానికి కంఠీరవ స్టేడియం సిద్ధం.. ప్రత్యేకతలేంటీ?

కర్ణాటక ముఖ్యమంత్రిగా 2013 మే 13న ఇదే కంఠీరవ స్టేడియంలో సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు.

Karnataka CM: 2018 సీన్ మళ్లీ కనపడుతుందా? ప్రమాణ స్వీకారోత్సవానికి కంఠీరవ స్టేడియం సిద్ధం.. ప్రత్యేకతలేంటీ?

2018లో సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన నేతలు

Updated On : May 19, 2023 / 6:15 PM IST

Karnataka: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య (Siddaramaiah), డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ (DK Shivakumar), ఇతర మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి సర్వం సిద్ధమైంది. శనివారం జరగనున్న ఈ కార్యక్రమానికి కంఠీరవ స్టేడియం (Sree Kanteerava Outdoor Stadium)లో ఏర్పాట్లు పూర్తి చేశారు. పలువురు కాంగ్రెస్ (Congress) నేతలు ఈ స్టేడియాన్ని పరిశీలించారు.

ప్రమాణ స్వీకారం నేపథ్యంలో కర్ణాటక పోలీసులు 12 మంది ఏసీపీలు, 11 మంది రిజర్వ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్లు, 24 ఏఎస్ఐలు, 206 మంది కానిస్టేబుళ్లతో భద్రత ఏర్పాటు చేస్తున్నారు. అంతేగాక, కేంద్ర రిజర్వు పోలీసు దళం (CRPF) నుంచి కూడా భద్రతను కల్పిస్తున్నారు.

ఈ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కంఠీరవ స్టేడియానికి భారీ చరిత్ర ఉంది. కొన్ని దశాబ్దాల క్రితం దీన్ని నిర్మించారు. దీన్ని సంపంగి ఔట్ డోర్ స్టేడియం అని కూడా అంటారు. ఇది కర్ణాటక రాజధాని బెంగళూరులో ఉంటుంది. ఈ స్టేడియాన్ని అనేక విధాలుగా వినియోగించుకోవచ్చు. ఇందులో రన్నింగ్ ట్రాక్, వాలీ బాల్ కోర్టు, ఔట్ డోర్ రాక్ క్లైంబింగ్ వాల్స్ వంటివి ఉన్నాయి. ఇది కర్ణాటక క్రీడా శాఖ నిర్వహణలో ఉంటుంది.

2013లో ఇదే స్టేడియంలో..
కర్ణాటక ముఖ్యమంత్రిగా 2013 మే 13న ఇదే కంఠీరవ స్టేడియంలో సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన 2018 మే 17 వరకు సీఎంగా కొనసాగారు. అప్పట్లో ప్రమాణ స్వీకారం చేసిన స్టేడియంలోనే మళ్లీ ఇప్పుడు సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.

2018లో ప్రమాణ స్వీకారం.. ప్రతిపక్షాల ఐక్యత
కర్ణాటకలో 2018లో జరిగిన ఎన్నికల్లో హంగ్ ఏర్పడిన విషయం తెలిసిందే. దీంతో అప్పట్లో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఆ సమయంలో జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి ముఖ్యమంత్రిగా విధానసౌధ వద్ద ప్రమాణ స్వీకారం చేశారు. ఆ కార్యక్రమంలో ప్రతిపక్షాల ఐక్యతను చాటారు.

ప్రమాణ స్వీకారానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, సీపీఎం నుంచి సీతారాం ఏచూరి, ఎన్సీపీ నుంచి శరద్ పవార్ హాజరయ్యారు. ప్రతిపక్షాల ఐక్యతను చాటారు. ఈ సారి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాల ఐక్యతను చాటాలని భావిస్తోంది.

2018లో సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన నేతలు..

Karnataka: సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం.. కేసీఆర్ సహా ఈ నేతలు మాత్రం…