Siddaramaiah : కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ఇంట్లో విషాదం

రమే గౌడ మరణంతో సిద్ధరామయ్య కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రమే గౌడకు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

Siddaramaiah

Rame Gowda passes away : కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరి శివమ్మ భర్త రమే గౌడ(69) మరణించారు. శనివారం ఉదయం రమే గౌడ అనారోగ్యానికి గురికావడంతో వెంటనే అయన్ను చికిత్స కోసం మైసూరులోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడతో ఆయన మృతి చెందారు.

రమే గౌడ మరణంతో సిద్ధరామయ్య కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రమే గౌడకు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. సాయంత్రం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

Siddaramaiah : వరుణ నుంచి సిద్ద రామయ్య విజయం..మరోసారి సీఎం అవుతారా?

మరోవైపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. హస్తం పార్టీ విజయం దిశగా దూసుకుపోతోంది. మాజీ సీఎం సిద్ధరామయ్య ఘన విజయం సాధించారు. వరుణ నుంచి ఆయన గెలుపుపొందారు. బీజేపీ అభ్యర్థి సోమన్ పై సిద్ధరామయ్య విజయం సాధించారు.

రాష్ట్రంలో 120పైగా స్థానాల్లో గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే, ఇలాంటి సమయంలో మాజీ సీఎం సిద్ధరామయ్య ఇంట్లో విషాదం నెలకొంది.