Siddaramaiah : వరుణ నుంచి సిద్ద రామయ్య విజయం..మరోసారి సీఎం అవుతారా?

కాంగ్రెస్ దూకుడుకు బీజేపీ నేతలు కళ్లెం వేసే పరిస్థితే కాదు కనీసం దరిదాపుల్లో కూడా కమలం పార్టీ లేదు. అప్రతిహంగా హస్తం పార్టీ హవా కొనసాగుతున్న క్రమంలో మాజీ సీఎం సిద్ధరామయ్య విజయం సాధించారు. వరుణ నుంచి సిద్ధరామయ్య బీజేపీ అభ్యర్థి సోమన్ పై విజయం సాధించారు.

Siddaramaiah : వరుణ నుంచి సిద్ద రామయ్య విజయం..మరోసారి సీఎం అవుతారా?

Siddaramaiah Won Karnataka ELections

Karnataka Election Result 2023: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా దూసుకుపోతోంది. కాంగ్రెస్ దూకుడుకు బీజేపీ నేతలు కళ్లెం వేసే పరిస్థితే కాదు కనీసం దరిదాపుల్లో కూడా కమలం పార్టీ లేదు. అప్రతిహంగా హస్తం పార్టీ హవా కొనసాగుతున్న క్రమంలో మాజీ సీఎం సిద్ధరామయ్య విజయం సాధించారు. వరుణ నుంచి సిద్ధరామయ్య బీజేపీ అభ్యర్థి సోమన్ పై విజయం సాధించారు. మాజీ సీఎం 2008, 2013లో గెలుపొందిన వరుణ స్థానం సిద్ధరామయ్య కుటుంబానికి కంచుకోటగా ఉంది. 2018లో సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర 58,616 ఓట్ల ఆధిక్యతతో బీజేపీ అభ్యర్థి టి బసవరాజును ఓడించి విజయం సాధించారు.

కాగా కాంగ్రెస్ కర్ణాటక ఎన్నికల్లో సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు. ఈక్రమంలో విజయం దిశగా కాంగ్రెస్ దూసుకుపోతున్న తరుణంలో సీఎం పంచాయితీ మొదలైంది హస్తం పార్టీలో. సీఎం ఎవరు? అనేదానిపై సీఎల్పి బేటీకానుంది. నేతలంతా సీఎల్సీ మీటింగ్ కు హాజరవ్వాలని జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆహ్వానించారు. ప్రభుత్వం ఏర్పాటుతో పాటు సీఎం అభ్యర్థి ఎవరు? అనేదానిపై కూడా సీఎల్సీలో చర్చించి నిర్ణయం తీసుకుంటారని సమాచారం. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంపై పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే స్పందిస్తు.. ఇది ప్రజా విజయం అని అన్నారు.డబ్బు, అధికారం పనిచేయలేదన్నారు. సీఎం అభ్యర్థిని హైకమాండే నిర్ణయిస్తుందని స్పష్టంచేశారు.

మరి మరోసారి సిద్దరామయ్య సీఎం అవుతారా? కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది? అనేదానిపై ఆసక్తి నెలకొంది. మానాన్నే మరోసారి సీఎం కావాలని సిద్దరామయ్య కుమారుడి యతీంద్ర తన ఆకాంక్షను వ్యక్తంచేసిన క్రమంలో సీఎం పంచాయితీ కాంగ్రెస్ లో కాక రేపుతుందా?అనిపిస్తోంది. మరోపక్క తన అభ్యర్థులను భద్రపరుచుకోవటానికి కాంగ్రెస్ బెంళూరుకు తరలిస్తోంది.