Uttarakhand : నదిలోకి దూసుకెళ్లిన కారు…ఆరుగురి ఆదికైలాష్ యాత్రికుల మృతి

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తరాఖండ్‌లో కారు నదిలో పడి ఆరుగురు ఆది కైలాస యాత్రికులు మృతి చెందారు....

car falls into river

Uttarakhand : ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తరాఖండ్‌లో కారు నదిలో పడి ఆరుగురు ఆది కైలాస యాత్రికులు మృతి చెందారు. ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్ జిల్లాలో ఆది కైలాస దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా కారు నదిలో పడిపోవడంతో ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్ జిల్లాలో మంగళవారం కారు లఖన్‌పూర్ సమీపంలో కాళీ నదిలో పడిపోవడంతో ఆరుగురు మరణించారని పోలీసులు తెలిపారు.

Also Read : World Cup-2023 : ఐసీసీ వరల్డ్ కప్.. బంగ్లాదేశ్ పై దక్షిణాఫ్రికా ఘన విజయం

ఆది కైలాస దర్శనం తర్వాత బాధితులు తిరిగి వస్తుండగా ధార్చులా-లిపులేఖ్ రహదారిపై మంగళవారం రాత్రి ఆలస్యంగా ఈ ఘటన జరిగిందని పితోర్‌ఘర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) లోకేశ్వర్ సింగ్ తెలిపారు. మృతుల్లో ఇద్దరు బెంగళూరు, ఇద్దరు తెలంగాణ, ఇద్దరు ఉత్తరాఖండ్‌కు చెందిన వారని తెలిపారు.

Also Read : Nara Bhuvaneswari : చంద్రబాబు లేకుండా తొలిసారి ఒంటరిగా.. నారా భువనేశ్వరి భావోద్వేగ ట్వీట్

మృతుల కుటుంబాలకు ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామి సంతాపం తెలిపారు. నదిలో నుంచి మృతదేహాల వెలికితీత కార్యక్రమం బుధవారం ఉదయం ప్రారంభిస్తామని ఎస్పీ చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు