జమ్మూ కశ్మీర్ లో గ్రనేడ్ దాడి : ఆరుగురికి తీవ్ర గాయాలు

  • Publish Date - October 28, 2019 / 11:56 AM IST

జమ్మూ  కాశ్మీర్ లో మరో సారి గ్రనేడ్ దాడి జరిగింది. బారాముల్లా జిల్లాలోని  సోపోర్ బస్సాండు వద్ద ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో ఆరుగురు పౌరులు గాయపడ్డారు.   గాయపడిన వారినవి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సోపోర్ బస్టాండ్ లో భారీగా పోలీసులను మొహరించారు.  అక్టోబరు  26వ తేదీన కరణ్‌ నగర్‌ పోలీసు స్టేషన్‌ వద్ద జరిపిన గ్రెనేడ్‌ దాడిలో ఆరుగురు సీఆర్పీఎఫ్‌ జవాన్లు గాయపడిన విషయం తెలిసిందే.