Gold and silver price: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఏయే నగరాల్లో ఎంతంటే?

బంగారం దిగివచ్చింది. ధరలు స్వల్పంగా తగ్గాయి. శనివారం అమాంతం పెరిగిన ధరలుకాస్త శాంతించాయి. దేశియ బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,800...

Gold and silver price: బంగారం దిగివచ్చింది. ధరలు స్వల్పంగా తగ్గాయి. శనివారం అమాంతం పెరిగిన ధరలుకాస్త శాంతించాయి. దేశియ బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,800 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్స్ బంగారం ధర 1888.44 డాలర్లు పలికింది. మరోవైపు ఔన్స్ వెండి ధర 23.21 డాలర్లకు చేరుకుంది. ఆదివారం దేశీయంలో బంగారం, వెండి ధరలు చూస్తే..

Gold silver price: పెరిగిన బంగారం, వెండి ధరలు.. అక్షయ తృతీయ ముందు మహిళలకు షాక్..

22 క్యారెట్ల బంగారాన్ని నగల తయారీలో వినియోగిస్తారు. మనం ఎక్కువగా కొనే బంగారం ఇదే. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,400 ఉంది. నిన్నటితో పోల్చితే రూ.150 తగ్గింది. 24 క్యారెట్ల ధర రూ. 52.800 వద్ద ఉంది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,400 ఉండగా 24 క్యారెంట్ల 10 గ్రాముల ధర రూ. 52,800గా ఉంది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48.400 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 52.800 ఉంది. ముంబై, కేరళ, విశాఖపట్టణం, బెంగళూరుల్లో బంగారం ధరలు ఒకే రకంగా ఉన్నాయి. 22 క్యారెంట్ల 10 గ్రాముల ధరం రూ. 48,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 52,800 వద్దకు చేరింది. తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 49,030 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 53,490 వద్ద కొనసాగుతుంది.

Gold Smuggling: షార్జా టూ భారత్ గోల్డ్ స్మగ్లింగ్.. విమానాశ్రయంలో బంగారు పెట్టె!

దేశీయంగా వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్టణం, చెన్నై, బెంగళూరు, కేరళలో కిలో వెండి రూ.69,500కి పెరిగింది. ముంబై, న్యూఢిల్లీ, కోల్‌కతా, పూణె, జైపూర్, లక్నోల్లో రూ.63,500కి ఎగబాకింది. గత 10 రోజుల్లో వెండి ధరలు ఆరుసార్లు తగ్గాయి. రెండుసార్లు పెరిగాయి. మరో రెండు రోజుల్లో అక్షయ తృతీయ ఉండటంతో బంగారం ధరలు మరింత తగ్గుతాయని మహిళలు ఆశగా చూస్తున్నారు. అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేస్తే మంచిదన్న ఆనవాయితీ ఉంది.

ట్రెండింగ్ వార్తలు