Gold silver price: పెరిగిన బంగారం, వెండి ధరలు.. అక్షయ తృతీయ ముందు మహిళలకు షాక్..

బంగారం, వెండి ధరలు పెరిగాయి. గత తొమ్మిది సెషన్లుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు శనివారం పుంజుకున్నాయి. శనివారం దేశీయంగా బంగారం 10 గ్రాముల ధరపై రూ. 550 వరకు...

Gold silver price: పెరిగిన బంగారం, వెండి ధరలు.. అక్షయ తృతీయ ముందు మహిళలకు షాక్..

Gold And Silvar

Gold silver price: బంగారం, వెండి ధరలు పెరిగాయి. గత తొమ్మిది సెషన్లుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు శనివారం పుంజుకున్నాయి. శనివారం దేశీయంగా బంగారం 10 గ్రాముల ధరపై రూ. 550 వరకు పెరగగా, కిలో వెండిపై రూ. 200 వరకు పెరిగింది. మరో మూడు రోజుల్లో అక్షయ తృతీయ ఉండటం, ఈ క్రమంలో బంగారం, వెండి ధరలు పెరగడం గమనార్హం. మే 3న అక్షయ తృతీయ ఉంది. అక్షయ తృతీయ రోజు మహిళలు కొంచెమైనా బంగారం కొనుగోలు చేయటం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో బంగారం ధరలు పుంజుకున్నాయి. అయితే మరో రెండు రోజుల్లో ధరల్లో తగ్గుదల కనిపిస్తుందా, మరింత పెరుగుతుందా అనేది చూడాల్సిందే.

Today Gold Rate: భారీగా.. రూ.1700 పెరిగిన బంగారం ధర

దేశంలో బంగారం, వెండికి మహిళలు ఎంతో ప్రాధాన్యతనిస్తుంటారు. ఉక్రెయిన్ – రష్యా దాడుల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. అయితే తాజాగా వీటి ధరలు పెరగడం వెనుక అనేక కారణాలున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ బంగారం ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కోవిడ్, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు ఇలా పలు రకాల కారణాలతో బంగారం ధరలు పెరుగుదలకు కారణంగా బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

Gold Rate: మూడు రోజుల్లో వెయ్యి పెరిగిన గోల్డ్ రేట్

తాజాగా పెరిగిన బంగారం ధరలను చూస్తే.. హైదరాబాద్ లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.550 పెరిగి రూ.48,550కి చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.590 ఎగిసి రూ.52,960 వద్ద నమోదైంది. అదేవిధంగా కేజీ వెండి రూ. 200 పెరిగి రూ. 69,200కు చేరింది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,500కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 52,960కి చేరింది. వెండి రేటు కూడా విజయవాడలో రూ.200 పెరిగి కేజీకి రూ.69,200కు ఎగబాకింది. దేశీయంగా చూసుకుంటే దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,550 ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 52,960గా ఉంది. చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,970 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 53,420కు చేరింది.