పాముని పట్టుకుని సంచిలో వేస్తుండగా ఊహించని ఘోరం జరిగిపోయింది.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..

పాములను చాక్యచక్యంగా పట్టుకోవడంలో ఎక్స్ పర్ట్. ఆ ప్రాంతంలో ఎక్కడ పాము కనిపించినా స్థానికులు వెంటనే సునీల్ కు ఫోన్ చేస్తారు.

Cobra Bite (Photo Credit : Google)

Cobra Bite : మరణం ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. అది ఏ రూపంలోనైనా రావొచ్చు. భూమ్మీద నూకలు చెల్లాయి అంటే చావు తధ్యమే. పాములు పట్టే వ్యక్తి విషయంలో ఇదే జరిగింది. పాములు పట్టడంలో అతడు దిట్ట. పాములను పట్టుకుని వాటిని జనావాసాలకు దూరంగా వదిలేయడం వెన్నతో పెట్టిన విద్య. ఇప్పటివరకు ఎన్నో సర్పాలను ఇలా పట్టుకున్నాడు. కానీ, దురదృష్టవశాత్తూ చివరికి ఆ పాము కాటుకే బలైపోయాడు. పాముని పట్టుకుని సంచిలో వేస్తుండగా ఒక్కసారిగి అది కాటేసింది. అంతే, అతడు మరణించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మహారాష్ట్రలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గోండియాలో పాములు పట్టే వ్యక్తి చివరికి పాము కాటుకు బలపైపోయాడు. ఆ వ్యక్తి పేరు సునీల్. పాములను చాక్యచక్యంగా పట్టుకోవడంలో ఎక్స్ పర్ట్. ఆ ప్రాంతంలో ఎక్కడ పాము కనిపించినా స్థానికులు వెంటనే సునీల్ కు ఫోన్ చేస్తారు. అతడు వచ్చి సర్పాన్ని ఎంతో ఈజీగా పట్టేస్తాడు. ఎప్పటిలాగే ఓ చోట పాము ఉందని సమాచారం వస్తే సునీల్ వెళ్లాడు. తన టాలెంట్ తో పాముని పట్టుకున్నాడు. దాన్ని ఓ సంచిలో వేసే ప్రయత్నం చేస్తున్నాడు. సరిగ్గా ఇదే సమయంలో దారుణం జరిగిపోయింది. రెప్పపాటులో విష సర్పం అతడిని కాటేసింది. ఊహించని ఈ ఘటనతో సునీల్ తో పాటు అక్కడున్న వారంతా షాక్ తిన్నారు. తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పాము కాటుకు గురైన సునీల్ ను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ, లాభం లేకపోయింది. సునీల్ చనిపోయాడు.

పాముని పట్టుకుని సంచిలో వేస్తుండగా అది సునీల్ లు కాటేయడం వీడియోలో రికార్డ్ అయ్యింది. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాములను పట్టుకోవడంలో సునీల్ దిట్ట. జనావాసాల్లోకి వచ్చే సర్పాలను పట్టుకుని వాటి ఊరికి దూరంగా వదిలేసేవాడు. పాములను కాపాడటంలో అతడి అంకితభావాన్ని అంతా మెచ్చుకునే వారు. స్థానికులు అతడిని సర్ప మిత్ర అని పిలుస్తారు. అయితే, దురదృష్టవశాత్తు చివరికి ఆ పాము కాటుకే సునీల్ బలైపోవడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు.

సునీల్ నాగ్ పూర్ వయసు 44 ఏళ్లు. అతడు సర్పాలను పట్టుకోవడంలో నిపుణుడు. నీళ్లు తాగినంత సులభంగా పాములను పట్టేవాడు. ఇప్పటివరకు అతడు వందల సంఖ్యలో పాములను కాపాడాడు. ఇదే క్రమంలో ఓ ఇంట్లో పాము ఉందని సునీల్ కు సమాచారం వచ్చింది. అది రాత్రి పూట అయినా అతడు ఆగలేదు. సమాచారం అందిన వెంటనే అక్కడికి బయలుదేరాడు. ఆ ఇంట్లో ఉన్నది కోబ్రా. విష సర్పం. ఎంతో చాక్యచక్యంగా దాన్ని పట్టుకున్నాడు. ఓ సంచిలో వేసే ప్రయత్నంలో ఉన్నాడు. సరిగ్గా అదే సమయంలో పాము తిరగబడింది. అతడి చేతిపై కాటు వేసింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే విషం శరీరం అంతా పాకేసింది. దాంతో సునీల్ ను డాక్టర్లు కాపాడలేకపోయారు. అతడి చనిపోయాడు.

కాగా, విష సర్పాలను పట్టుకునే సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. కచ్చితంగా పాములు పట్టే వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సర్పాలను పట్టుకోవడంలో వారు ఎంత నేర్పిరి అయినా.. జాగ్రత్తలు తీసుకోవం తప్పనిసరి. చేతులకు రక్షణగా ఏవైనా ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒట్టి చేతులతో పాములను పట్టుకోవడం అంత సేఫ్ కాదు, ప్రాణాలకే ప్రమాదం అని చెప్పడానికి ఈ దుర్ఘటనే నిదర్శనం.

Also Read : బెంగళూరులో షాకింగ్ ఘటన.. మార్నింగ్ వాక్ చేస్తున్న మహిళపై లైంగిక దాడి, వెనుక నుంచి వచ్చి గట్టిగా పట్టుకుని..

ట్రెండింగ్ వార్తలు